Last Updated:
హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు తీవ్రంగా మారుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో కీలక భేటీ నిర్వహించారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన ఈ సమావేశంలో హోర్ముజ్ జలసంధి భద్రత, నౌకాయానం, ఇంధన సరఫరాలు, ద్వైపాక్షిక వాణిజ్యం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్‌కు చమురు సరఫరాలో హోర్ముజ్ కీలక మార్గం కావడంతో.. ఈ భేటీకి వ్యూహాత్మక ప్రాధాన్యం ఏర్పడింది.
కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో సోమవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో కీలక భేటీ నిర్వహించారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, సముద్ర భద్రత, నౌకాయానం, ఇంధన సరఫరాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఏర్పడింది.

