బంగాళాదుంప తెలంగాణలో అయితే ఆలు గడ్డ.. కూరలు, స్నాక్స్ ఇలా ఎన్నో వంటకాల్లో నిత్యం ఉపయోగించే పదార్థం. అయితే బంగాళాదుంపను వండుకునే ముందు చాలామంది తొక్కలను తీసి చెత్తబుట్టలో పడేస్తుంటారు. నిజానికి ఈ తొక్కల్లోనే ఫైబర్, పొటాషియం, విటమిన్-సి, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఐరన్ వంటి పలు పోషకాలు ఉంటాయి. అందువల్ల వాటిని పూర్తిగా వ్యర్థంగా భావించకుండా, సరైన విధంగా ఉపయోగించుకోవచ్చు.

