Last Updated:
ఎస్ఆర్డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా ‘వేట’ సోమవారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఎస్ఆర్డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా ‘వేట’ సోమవారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీకి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

