Last Updated:
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ‘శగున్ సిప్’ను ప్రారంభించింది. దీని ద్వారా బంగారం, వెండిని గ్రాముల లెక్కన కూడబెట్టుకోవచ్చు. ఇది దీర్ఘకాలిక లక్ష్యాలకు ఉపయోగపడుతుంది.
బంగారం, వెండిలో క్రమంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్త డిజిటల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘శగున్ సిప్’ పేరుతో ప్రారంభించిన ఈ ఫీచర్ ద్వారా బంగారం, వెండిని గ్రాముల లెక్కన కొంచెం కొంచెంగా కూడబెట్టుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టే వారికి ఇది ఉపయోగపడేలా రూపొందించారు. భారత్‌లోని ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఒకటైన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ‘శగున్ సిప్’ను ప్రారంభించింది. పరిశ్రమలో తొలిసారిగా తీసుకొచ్చిన డిజిటల్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫీచర్‌గా దీన్ని సంస్థ చెబుతోంది. దీని ద్వారా యాక్సిస్ గోల్డ్ ఫండ్, యాక్సిస్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాల్లో గ్రాముల రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు.

