Last Updated:
అప్పుడప్పుడు వెరైటీగా కొత్త రుచులను ప్రయత్నిస్తే ఇంట్లో వాళ్లు కూడా ఇష్టంగా తింటారు. అలాంటి సమయంలో పుట్నాల పప్పు కాంబినేషన్‌లో చేసే ఈ పల్లీ చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది.
ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, బోండా వంటి టిఫిన్స్ చేసుకున్నప్పుడు వాటికి ఒకే రకమైన చట్నీ పెడితే ఎవరికైనా బోర్ కొడుతుంది. ముఖ్యంగా పిల్లలు అయితే రోజూ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీనే పెడితే టిఫిన్ తినడానికి కూడా ఆసక్తి చూపించరు. అందుకే అప్పుడప్పుడు వెరైటీగా కొత్త రుచులను ప్రయత్నిస్తే ఇంట్లో వాళ్లు కూడా ఇష్టంగా తింటారు. అలాంటి సమయంలో పుట్నాల పప్పు కాంబినేషన్‌లో చేసే ఈ పల్లీ చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా సులభం. తక్కువ పదార్థాలతోనే త్వరగా చేసుకోవచ్చు.

