టీ, నిమ్మరసం, సలాడ్లు, పచ్చళ్లు, కూరలు ఇలా రోజువారీ వంటల్లో నిమ్మకాయకు ఎన్నో ఉపయోగాలున్నాయి. అందుకే ఒక్కసారిగా మొత్తం నిమ్మకాయను ఖర్చు చేయకుండా సగం మిగిలిపోవడం సహజమే. అలాంటి సమయంలో మిగిలిన భాగాన్ని ఫ్రిజ్‌లో అలా ఓపెన్‌గా పడేయడం కంటే.. కోసిన వైపును కప్పి నిల్వ చేయడం చిన్నదైనా ఉపయోగకరమైన జాగ్రత్త. ఇలా చేస్తే నిమ్మకాయ త్వరగా ఎండిపోకుండా, తదుపరి ఉపయోగించే వరకు దాని నాణ్యతను మెరుగ్గా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని లోకల్ 18తెలుగు ధృవీకరించడం లేదు.)
