Last Updated:
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి కీలక గరిష్ఠాలకు చేరాయి. మరి ఈ జోరు వచ్చే వారం కూడా కొనసాగుతుందా? లేక ఒక్కసారిగా ధరలు తగ్గుతాయా? వచ్చే వారం గోల్డ్, సిల్వర్ రేట్లలో ఏం జరగొచ్చో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.
బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు, అమెరికా డాలర్ బలహీనపడటం వంటి అంశాలతో పెట్టుబడిదారులు విలువైన లోహాల వైపు మొగ్గుచూపడంతో శుక్రవారం వరుసగా రెండో సెషన్లోనూ ధరలు దూసుకెళ్లాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర మూడు నెలలకు పైగా గరిష్ఠ స్థాయికి చేరగా, వెండి ధర 15 వారాల గరిష్ఠాన్ని తాకింది.

