ఇదిలా ఉంటే, ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ బలాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ 0.12 శాతం తగ్గి 99.54 వద్ద ట్రేడైంది. ప్రపంచ చమురు ధరలకు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్‌లో 0.47 శాతం పెరిగి బ్యారెల్‌కు 88.94 డాలర్లుగా ట్రేడైంది. దేశీయ స్టాక్ మార్కెట్‌లోనూ ఒత్తిడి కనిపించింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 284.85 పాయింట్లు పడిపోయి 77,717.05 వద్ద ఉంది. నిఫ్టీ 69.25 పాయింట్లు తగ్గి 24,297.05 వద్ద ట్రేడైంది. ఎక్స్చేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికరంగా రూ.508.12 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు, ఆగస్టు 7తో ముగిసిన వారంలో భారత్ ఫారెక్స్ నిల్వలు 14.136 బిలియన్ డాలర్లు పెరిగి 707.002 బిలియన్ డాలర్లకు చేరాయి. శుక్రవారం ఆర్‌బీఐ ఈ వివరాలను వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
