ప్రభన్యూస్

Insect Attack: చిత్తూరులో వింత పురుగు కలకలం.. చెట్టు కింద ఆడుకున్న 20 మంది విద్యార్థులకు అస్వస్థత..! Chittoor school insect attack. | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

చిత్తూరు జిల్లా డి.ఎం.పురం ప్రభుత్వ హైస్కూల్‌లో మామిడి చెట్టు నుంచి పడిన పురుగులతో 20 మంది విద్యార్థులకు దురద, మంటలు, ఆస్పత్రిలో చికిత్స, ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు

+

News18

News18

చిత్తూరు జిల్లాలో ఓ వింత పురుగు దాడి కలకలం రేపింది. పాఠశాల విరామ సమయంలో మామిడి చెట్టు కింద ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్టు నుంచి ఒక్కసారిగా పడిన పురుగుల కారణంగా దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శరీరంపై దురదలు, దద్దుర్లు, మంటలు రావడంతో చిన్నారులు ఒక్కసారిగా కేకలు వేయడంతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళన నెలకొంది.

ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం డి.ఎం.పురం ప్రభుత్వ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. ఉదయం యథావిధిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తరగతులు పూర్తయ్యాక విరామ సమయంలో ప్రాంగణంలోని మామిడి చెట్టు కింద ఆటలు ఆడుకుంటున్నారు. ఇదే సమయంలో చెట్టు నుంచి చిన్న చిన్న పురుగులు విద్యార్థులపై పడినట్లు వారు తెలిపారు. మొదట వాటిని చేతులతో తొలగించినా, కొద్ది నిమిషాల్లోనే పురుగులు తాకిన శరీర భాగాల్లో తీవ్ర దురద, దద్దుర్లు, మంటలు మొదలయ్యాయి.

విద్యార్థులు ఏడుస్తూ ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమయ్యారు. అత్యవసర సేవలకు సమాచారం అందించి 108 అంబులెన్స్ సాయంతో బాధిత విద్యార్థులను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. పిల్లలు క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

వైద్యుల ప్రాథమిక అంచనా ప్రకారం కొన్ని రకాల చెట్లపై నివసించే వెంట్రుకల వంటి సూక్ష్మ రోమాలు కలిగిన పురుగులు లేదా గొంగళి పురుగులు చర్మాన్ని తాకినప్పుడు అలర్జీ, దురద, మంటలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి పురుగుల సంచారం పెరిగే అవకాశముండటంతో పిల్లలు చెట్ల కింద ఆడుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇలాంటి ఘటనలు గతంలో తమిళనాడులోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని జిల్లాల్లో కూడా నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు వివరాలు సేకరిస్తుండగా, పాఠశాల ప్రాంగణంలోని చెట్ల వద్ద అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. చిన్నారుల భద్రత దృష్ట్యా పాఠశాల పరిసరాల్లో పురుగుల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 July 2026, 3:07 am Digital Edition : Prabhanews
Insect Attack: చిత్తూరులో వింత పురుగు కలకలం.. చెట్టు కింద ఆడుకున్న 20 మంది విద్యార్థులకు అస్వస్థత..! Chittoor school insect attack. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jun 30, 2026 10:53 PM ISTచిత్తూరు జిల్లా డి.ఎం.పురం ప్రభుత్వ హైస్కూల్‌లో మామిడి చెట్టు నుంచి పడిన పురుగులతో 20 మంది విద్యార్థులకు దురద, మంటలు, ఆస్పత్రిలో చికిత్స, ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు+
News18చిత్తూరు జిల్లాలో ఓ వింత పురుగు దాడి కలకలం రేపింది. పాఠశాల విరామ సమయంలో మామిడి చెట్టు కింద ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్టు నుంచి ఒక్కసారిగా పడిన పురుగుల కారణంగా దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శరీరంపై దురదలు, దద్దుర్లు, మంటలు రావడంతో చిన్నారులు ఒక్కసారిగా కేకలు వేయడంతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళన నెలకొంది.ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం డి.ఎం.పురం ప్రభుత్వ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. ఉదయం యథావిధిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తరగతులు పూర్తయ్యాక విరామ సమయంలో ప్రాంగణంలోని మామిడి చెట్టు కింద ఆటలు ఆడుకుంటున్నారు. ఇదే సమయంలో చెట్టు నుంచి చిన్న చిన్న పురుగులు విద్యార్థులపై పడినట్లు వారు తెలిపారు. మొదట వాటిని చేతులతో తొలగించినా, కొద్ది నిమిషాల్లోనే పురుగులు తాకిన శరీర భాగాల్లో తీవ్ర దురద, దద్దుర్లు, మంటలు మొదలయ్యాయి.విద్యార్థులు ఏడుస్తూ ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమయ్యారు. అత్యవసర సేవలకు సమాచారం అందించి 108 అంబులెన్స్ సాయంతో బాధిత విద్యార్థులను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. పిల్లలు క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.వైద్యుల ప్రాథమిక అంచనా ప్రకారం కొన్ని రకాల చెట్లపై నివసించే వెంట్రుకల వంటి సూక్ష్మ రోమాలు కలిగిన పురుగులు లేదా గొంగళి పురుగులు చర్మాన్ని తాకినప్పుడు అలర్జీ, దురద, మంటలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి పురుగుల సంచారం పెరిగే అవకాశముండటంతో పిల్లలు చెట్ల కింద ఆడుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇలాంటి ఘటనలు గతంలో తమిళనాడులోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని జిల్లాల్లో కూడా నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు వివరాలు సేకరిస్తుండగా, పాఠశాల ప్రాంగణంలోని చెట్ల వద్ద అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. చిన్నారుల భద్రత దృష్ట్యా పాఠశాల పరిసరాల్లో పురుగుల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.Location :Chittoor,Chittoor,Andhra PradeshFirst Published :Jun 30, 2026 10:53 PM ISTమరింత చదవండి

Source link