Last Updated:
PM E-DRIVE Subsidy | పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని 2028 వరకు పొడిగించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీ సగానికి తగ్గించారు. కిలోవాట్‌కు రూ.2,500 ప్రోత్సాహకం, గరిష్ఠంగా రూ.5,000 లభిస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-DRIVE) పథకాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించింది. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీని సగానికి తగ్గించింది. గతంలో కిలోవాట్ అవర్‌కు రూ.5,000గా ఉన్న ప్రోత్సాహకాన్ని ఇప్పుడు రూ.2,500కు తగ్గించారు. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 2025 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు రిజిస్టర్ చేసిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కిలోవాట్ అవర్‌కు రూ.2,500 చొప్పున ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే ఒక్క వాహనానికి గరిష్ఠంగా రూ.5,000 మాత్రమే అందుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కిలోవాట్ అవర్‌కు రూ.5,000 ప్రోత్సాహకం ఉండేది. ఒక్క వాహనానికి గరిష్ఠంగా రూ.10,000 వరకు లభించేది.

