ఈ కోర్సుల పాఠ్య ప్రణాళికను రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో వాణిజ్య శాఖ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, రంగ నిపుణులు, టీ పరిశ్రమకు చెందిన నిపుణులు ఉన్నారు. ఈ కోర్సుల ద్వారా శిక్షణ పొందిన టీ టేస్టర్లు, టీ సొమెలియర్లు తయారవుతారు. వీరు టీ నాణ్యత పెంపు, టీపై అవగాహన, విలువ పెంపు, బ్రాండింగ్, భారతీయ టీలకు మార్కెట్లో పోటీ సామర్థ్యం పెంచడంలో సహాయపడతారు. అలాగే యువతలో టీపై అవగాహన పెంచడం, ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యాల్లో భాగం. (ప్రతీకాత్మక చిత్రం)

