ప్రభన్యూస్

Sobhita Dhulipala: ర్యాంప్ వాక్‌తో అదరగొట్టిన శోభిత దూళిపాళ్ల.. అక్కినేని కోడలు అదిరిందబ్బా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

అక్కినేని ఇంటి కోడలు శోభితా ధూళిపాళ, తాజాగా ర్యాంప్ పై ఓ అప్సరసలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

News18
News18

అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన టాలెంటెడ్ బ్యూటీ, అక్కినేని ఇంటి కోడలు శోభితా ధూళిపాళ.. తాజాగా ర్యాంప్ పై ఓ అప్సరసలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మోడలింగ్ రంగం నుంచి వచ్చి సినిమాల్లో సెటిలైన శోభిత, తన మూలాలను మర్చిపోకుండా తరచుగా ప్రతిష్టాత్మక ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొంటూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన ఎలైట్ ఫ్యాషన్ షోలో ఆమె చేసిన ర్యాంప్ వాక్, ప్రదర్శించిన హావభావాలు నెటిజన్లను, ఫ్యాషన్ ప్రియులను తీవ్రంగా కట్టిపడేస్తున్నాయి.

ఇండియన్ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఇండియా కౌచర్ వీక్’ (FDCI India Couture Week) గ్రాండ్ ఫినాలే ఇటీవల ఢిల్లీలో ఎంతో ఘనంగా ముగిసింది. గతంలో ప్యారిస్ కౌచర్ వీక్‌లో అద్భుతమైన కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా.. ఈ ఈవెంట్ లో తన ‘దేవి’ (Devi) కలెక్షన్‌ను, దానికి తోడు సరికొత్త ఫెస్టివ్ కౌచర్ లైన్‌ను ఆవిష్కరించారు. ‘నెక్సస్ న్యూయార్క్’ (Nexus New York) కొలాబరేషన్‌తో జరిగిన ఈ గ్రాండ్ షోలో శోభిత ధూళిపాళ షో స్టాపర్‌గా నిలిచి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన అద్భుతమైన దుస్తుల్లో ఆమె ఓ దేవతా విగ్రహంలా ర్యాంప్ పై నడిచి వచ్చింది.

శోభిత తన రాయల్ అండ్ మెజెస్టిక్ లుక్‌తో ర్యాంప్‌పై ఎంట్రీ ఇస్తూనే ఫ్యాషన్ ప్రియులకు విజువల్ ట్రీట్ అందించింది. ముందుగా ఐవరీ, షాంపైన్ టోన్‌లతో కూడిన ఎంబ్రాయిడరీ ప్యాంట్లు, చిన్న క్రిస్టల్ బీడ్‌వర్క్‌తో డిజైన్ చేసిన ఫిట్టెడ్ బోడిస్‌ను ధరించి హొయలు పోయింది. ఆ తర్వాత అదే ర్యాంప్‌పై కౌచర్‌లోని సరికొత్త ప్రయోగాన్ని ప్రదర్శిస్తూ, పూల ఆకృతులతో మెరిసే ఒక వాల్యూమినస్ లెహంగా స్కర్ట్‌ను ఆ ప్యాంట్‌పై అప్పటికప్పుడే ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సెంటర్ పార్టెడ్ హెయిర్‌స్టైల్, మెడలో మెరిసిపోతున్న డైమండ్ చోకర్‌తో శోభిత ధూళిపాళ ఇచ్చిన థియేట్రికల్ పర్ఫార్మెన్స్ ఈ షోకే హైలైట్ గా నిలిచింది. ఆమె నడక, చూపులు అచ్చం అప్సరసను తలపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్ గా రాణిస్తూనే, మరోవైపు నటిగా అద్భుతమైన ఫామ్ లో ఉంది శోభిత. నాగ చైతన్యను వివాహం చేసుకుని అక్కినేని కోడలిగా మారిన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. పెళ్లి తర్వాత శోభిత ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘చీకటిలో’ ఇటీవల నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. అడివి శేష్ సరసన ‘గూఢచారి’, ‘మేజర్’ లాంటి సూపర్ హిట్ పాన్ ఇండియా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ, ‘మంకీ మ్యాన్’ (Monkey Man) సినిమాతో హాలీవుడ్ స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. అటు ఫ్యాషన్, ఇటు సినిమాలను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ శోభిత ధూళిపాళ గ్లోబల్ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంటోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 July 2026, 8:18 pm Digital Edition : Prabhanews
Sobhita Dhulipala: ర్యాంప్ వాక్‌తో అదరగొట్టిన శోభిత దూళిపాళ్ల.. అక్కినేని కోడలు అదిరిందబ్బా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 30, 2026 8:16 PM ISTఅక్కినేని ఇంటి కోడలు శోభితా ధూళిపాళ, తాజాగా ర్యాంప్ పై ఓ అప్సరసలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. News18అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన టాలెంటెడ్ బ్యూటీ, అక్కినేని ఇంటి కోడలు శోభితా ధూళిపాళ.. తాజాగా ర్యాంప్ పై ఓ అప్సరసలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మోడలింగ్ రంగం నుంచి వచ్చి సినిమాల్లో సెటిలైన శోభిత, తన మూలాలను మర్చిపోకుండా తరచుగా ప్రతిష్టాత్మక ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొంటూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన ఎలైట్ ఫ్యాషన్ షోలో ఆమె చేసిన ర్యాంప్ వాక్, ప్రదర్శించిన హావభావాలు నెటిజన్లను, ఫ్యాషన్ ప్రియులను తీవ్రంగా కట్టిపడేస్తున్నాయి.ఇండియన్ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'ఇండియా కౌచర్ వీక్' (FDCI India Couture Week) గ్రాండ్ ఫినాలే ఇటీవల ఢిల్లీలో ఎంతో ఘనంగా ముగిసింది. గతంలో ప్యారిస్ కౌచర్ వీక్‌లో అద్భుతమైన కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా.. ఈ ఈవెంట్ లో తన 'దేవి' (Devi) కలెక్షన్‌ను, దానికి తోడు సరికొత్త ఫెస్టివ్ కౌచర్ లైన్‌ను ఆవిష్కరించారు. 'నెక్సస్ న్యూయార్క్' (Nexus New York) కొలాబరేషన్‌తో జరిగిన ఈ గ్రాండ్ షోలో శోభిత ధూళిపాళ షో స్టాపర్‌గా నిలిచి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన అద్భుతమైన దుస్తుల్లో ఆమె ఓ దేవతా విగ్రహంలా ర్యాంప్ పై నడిచి వచ్చింది.శోభిత తన రాయల్ అండ్ మెజెస్టిక్ లుక్‌తో ర్యాంప్‌పై ఎంట్రీ ఇస్తూనే ఫ్యాషన్ ప్రియులకు విజువల్ ట్రీట్ అందించింది. ముందుగా ఐవరీ, షాంపైన్ టోన్‌లతో కూడిన ఎంబ్రాయిడరీ ప్యాంట్లు, చిన్న క్రిస్టల్ బీడ్‌వర్క్‌తో డిజైన్ చేసిన ఫిట్టెడ్ బోడిస్‌ను ధరించి హొయలు పోయింది. ఆ తర్వాత అదే ర్యాంప్‌పై కౌచర్‌లోని సరికొత్త ప్రయోగాన్ని ప్రదర్శిస్తూ, పూల ఆకృతులతో మెరిసే ఒక వాల్యూమినస్ లెహంగా స్కర్ట్‌ను ఆ ప్యాంట్‌పై అప్పటికప్పుడే ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సెంటర్ పార్టెడ్ హెయిర్‌స్టైల్, మెడలో మెరిసిపోతున్న డైమండ్ చోకర్‌తో శోభిత ధూళిపాళ ఇచ్చిన థియేట్రికల్ పర్ఫార్మెన్స్ ఈ షోకే హైలైట్ గా నిలిచింది. ఆమె నడక, చూపులు అచ్చం అప్సరసను తలపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్ గా రాణిస్తూనే, మరోవైపు నటిగా అద్భుతమైన ఫామ్ లో ఉంది శోభిత. నాగ చైతన్యను వివాహం చేసుకుని అక్కినేని కోడలిగా మారిన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. పెళ్లి తర్వాత శోభిత ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘చీకటిలో’ ఇటీవల నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. అడివి శేష్ సరసన 'గూఢచారి', 'మేజర్' లాంటి సూపర్ హిట్ పాన్ ఇండియా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ, 'మంకీ మ్యాన్' (Monkey Man) సినిమాతో హాలీవుడ్ స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. అటు ఫ్యాషన్, ఇటు సినిమాలను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ శోభిత ధూళిపాళ గ్లోబల్ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంటోంది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link