ఎస్బీఐ స్కిల్ లోన్ స్కీమ్ అనేది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థల్లో నైపుణ్య అభివృద్ధి కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం రూపొందించిన టర్మ్ లోన్ సదుపాయం. వృత్తిపరమైన విద్య, శిక్షణ అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ రుణాన్ని విద్యార్థులు కోర్సు ఫీజులు చెల్లించడానికి, అవసరమైన స్టడీ మెటీరియల్ కొనుగోలు చేయడానికి, శిక్షణ పూర్తి చేయడానికి అవసరమైన ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్లోని సమాచారం ప్రకారం ఎస్బీఐ స్కిల్ లోన్ స్కీమ్ కింద కనీసం రూ.5,000 నుంచి గరిష్టంగా రూ.7,50,000 వరకు రుణం పొందవచ్చు. ఈ మొత్తాన్ని ట్యూషన్ లేదా కోర్సు ఫీజులు, పరీక్ష ఫీజులు, లైబ్రరీ ఫీజులు, ల్యాబొరేటరీ ఫీజులు, కాషన్ డిపాజిట్, పుస్తకాలు, పరికరాలు, కోర్సుకు అవసరమైన ఇతర సాధనాల కొనుగోలు కోసం ఉపయోగించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

