ప్రభన్యూస్

Cyber Fraud: స్టార్ హీరోయిన్ ఖాతాలో దొంగలు పడ్డారు.. క్షణంలోనే రూ.2.43 లక్షలు మాయం | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించే సినీ ప్రముఖులు సైతం ఆన్‌లైన్ హ్యాకర్ల వలలో చిక్కుకుని లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి చేరారు.

News18
News18

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించే సినీ ప్రముఖులు సైతం ఆన్‌లైన్ హ్యాకర్ల వలలో చిక్కుకుని లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి చేరారు. ‘పింక్’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి కుల్హారి.. తాజాగా సైబర్ మోసానికి గురయ్యారు. ఆమె ఎలాంటి ఆన్‌లైన్ కొనుగోలు చేయకపోయినా, ఎవరికీ ఓటీపీ చెప్పకపోయినా ఆమె క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా రూ. 2.43 లక్షలు మాయమవడం తీవ్ర కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే.. జూలై 24వ తేదీ రాత్రి ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఓ మల్టీప్లెక్స్‌కు కీర్తి కుల్హారి వెళ్లారు. ఆమె థియేటర్లో ఉన్న సమయంలో మొబైల్‌కు అకస్మాత్తుగా బ్యాంక్ నుంచి ఒక ట్రాన్సాక్షన్ మెసేజ్ వచ్చింది. విదేశీ ఎయిర్‌లైన్ సంస్థ అయిన ‘ఏరోమెక్సికో’ (Aeromexico) పేరిట ఏకంగా 2,525 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2.11 లక్షలు) డ్రా అయినట్లు ఆ మెసేజ్‌లో ఉంది. తాను విమాన టికెట్లు బుక్ చేయలేదని, ఎలాంటి షాపింగ్ కూడా చేయలేదని గ్రహించిన ఆమె వెంటనే అప్రమత్తమయ్యారు.

కొన్ని నిమిషాల్లోనే నాలుగుసార్లు.. అయితే, సైబర్ మోసగాళ్లు అంతటితో ఆగలేదు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఏకంగా నాలుగు సార్లు ఆమె క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించారు. ఈ అసాధారణ లావాదేవీలను గమనించిన బ్యాంక్ అధికారులు వెంటనే ఆమెకు సమాచారం అందించారు. అప్పటికే మొత్తం రూ. 2.43 లక్షలకు పైగా నగదు ఆమె అకౌంట్ నుంచి కట్ అయిపోయింది. వెంటనే అప్రమత్తమైన కీర్తి కుల్హారి, తన క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించారు. దీంతో తదుపరి జరగాల్సిన భారీ మోసం తప్పింది. అనంతరం ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐటీ చట్టాల కింద దర్యాప్తు ప్రారంభించారు.

ఓటీపీ చెప్పలేదు.. అయినా మోసం ఎలా? ఈ ఘటనలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. తాను ఎవరికీ ఓటీపీ (OTP), క్రెడిట్ కార్డ్ పిన్ (PIN), వెనుక ఉండే సీవీవీ (CVV) నంబర్లను ఎవరికీ చెప్పలేదని, అలాగే అనుమానాస్పద లింక్‌లపైనా క్లిక్ చేయలేదని కీర్తి కుల్హారి పోలీసులకు స్పష్టం చేశారు. సాధారణంగా అంతర్జాతీయ లావాదేవీలకు (International Transactions) మన దేశంలో లాగా ఓటీపీ అడగదు. కేవలం కార్డు నంబర్, సీవీవీ ఉంటే చాలు డబ్బులు కట్ అవుతాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు డార్క్ వెబ్ ద్వారా కార్డు వివరాలు కొనుగోలు చేసి ఉండొచ్చని, లేదా ఆమె మొబైల్‌లోకి ఏదైనా స్పైవేర్ (Spyware), మాల్వేర్ (Malware) పంపి డేటాను తస్కరించి ఉండొచ్చని సైబర్ పోలీసులు అనుమానిస్తున్నారు. కార్డు క్లోనింగ్ జరిగి ఉండే అవకాశం కూడా ఉందని దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్ నిపుణుల హెచ్చరికలు: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఫేక్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, కేవైసీ (KYC) అప్‌డేట్, పాన్ కార్డ్ లింక్, ఫ్రీ గిఫ్ట్స్ పేరుతో వచ్చే మెసేజ్‌లలో ఉండే లింకులపై పొరపాటున కూడా క్లిక్ చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, కాఫీ షాపుల్లో ఫ్రీగా దొరికే పబ్లిక్ వైఫైలను (Public Wi-Fi) ఉపయోగించి బ్యాంకింగ్ లావాదేవీలు చేయకూడదని సూచిస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ యాక్సెస్‌ను డిజేబుల్ చేసి ఉంచుకోవాలని, అవసరమైనప్పుడు మాత్రమే బ్యాంక్ యాప్ ద్వారా ఆన్ చేసుకోవాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 July 2026, 7:16 pm Digital Edition : Prabhanews
Cyber Fraud: స్టార్ హీరోయిన్ ఖాతాలో దొంగలు పడ్డారు.. క్షణంలోనే రూ.2.43 లక్షలు మాయం | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 30, 2026 6:35 PM ISTసైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించే సినీ ప్రముఖులు సైతం ఆన్‌లైన్ హ్యాకర్ల వలలో చిక్కుకుని లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి చేరారు.News18సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించే సినీ ప్రముఖులు సైతం ఆన్‌లైన్ హ్యాకర్ల వలలో చిక్కుకుని లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి చేరారు. 'పింక్', 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్', 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వంటి చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి కుల్హారి.. తాజాగా సైబర్ మోసానికి గురయ్యారు. ఆమె ఎలాంటి ఆన్‌లైన్ కొనుగోలు చేయకపోయినా, ఎవరికీ ఓటీపీ చెప్పకపోయినా ఆమె క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా రూ. 2.43 లక్షలు మాయమవడం తీవ్ర కలకలం రేపుతోంది.అసలేం జరిగిందంటే.. జూలై 24వ తేదీ రాత్రి ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఓ మల్టీప్లెక్స్‌కు కీర్తి కుల్హారి వెళ్లారు. ఆమె థియేటర్లో ఉన్న సమయంలో మొబైల్‌కు అకస్మాత్తుగా బ్యాంక్ నుంచి ఒక ట్రాన్సాక్షన్ మెసేజ్ వచ్చింది. విదేశీ ఎయిర్‌లైన్ సంస్థ అయిన 'ఏరోమెక్సికో' (Aeromexico) పేరిట ఏకంగా 2,525 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2.11 లక్షలు) డ్రా అయినట్లు ఆ మెసేజ్‌లో ఉంది. తాను విమాన టికెట్లు బుక్ చేయలేదని, ఎలాంటి షాపింగ్ కూడా చేయలేదని గ్రహించిన ఆమె వెంటనే అప్రమత్తమయ్యారు.కొన్ని నిమిషాల్లోనే నాలుగుసార్లు.. అయితే, సైబర్ మోసగాళ్లు అంతటితో ఆగలేదు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఏకంగా నాలుగు సార్లు ఆమె క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించారు. ఈ అసాధారణ లావాదేవీలను గమనించిన బ్యాంక్ అధికారులు వెంటనే ఆమెకు సమాచారం అందించారు. అప్పటికే మొత్తం రూ. 2.43 లక్షలకు పైగా నగదు ఆమె అకౌంట్ నుంచి కట్ అయిపోయింది. వెంటనే అప్రమత్తమైన కీర్తి కుల్హారి, తన క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించారు. దీంతో తదుపరి జరగాల్సిన భారీ మోసం తప్పింది. అనంతరం ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐటీ చట్టాల కింద దర్యాప్తు ప్రారంభించారు.ఓటీపీ చెప్పలేదు.. అయినా మోసం ఎలా? ఈ ఘటనలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. తాను ఎవరికీ ఓటీపీ (OTP), క్రెడిట్ కార్డ్ పిన్ (PIN), వెనుక ఉండే సీవీవీ (CVV) నంబర్లను ఎవరికీ చెప్పలేదని, అలాగే అనుమానాస్పద లింక్‌లపైనా క్లిక్ చేయలేదని కీర్తి కుల్హారి పోలీసులకు స్పష్టం చేశారు. సాధారణంగా అంతర్జాతీయ లావాదేవీలకు (International Transactions) మన దేశంలో లాగా ఓటీపీ అడగదు. కేవలం కార్డు నంబర్, సీవీవీ ఉంటే చాలు డబ్బులు కట్ అవుతాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు డార్క్ వెబ్ ద్వారా కార్డు వివరాలు కొనుగోలు చేసి ఉండొచ్చని, లేదా ఆమె మొబైల్‌లోకి ఏదైనా స్పైవేర్ (Spyware), మాల్వేర్ (Malware) పంపి డేటాను తస్కరించి ఉండొచ్చని సైబర్ పోలీసులు అనుమానిస్తున్నారు. కార్డు క్లోనింగ్ జరిగి ఉండే అవకాశం కూడా ఉందని దర్యాప్తు చేస్తున్నారు.సైబర్ నిపుణుల హెచ్చరికలు: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఫేక్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, కేవైసీ (KYC) అప్‌డేట్, పాన్ కార్డ్ లింక్, ఫ్రీ గిఫ్ట్స్ పేరుతో వచ్చే మెసేజ్‌లలో ఉండే లింకులపై పొరపాటున కూడా క్లిక్ చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, కాఫీ షాపుల్లో ఫ్రీగా దొరికే పబ్లిక్ వైఫైలను (Public Wi-Fi) ఉపయోగించి బ్యాంకింగ్ లావాదేవీలు చేయకూడదని సూచిస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ యాక్సెస్‌ను డిజేబుల్ చేసి ఉంచుకోవాలని, అవసరమైనప్పుడు మాత్రమే బ్యాంక్ యాప్ ద్వారా ఆన్ చేసుకోవాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link