ఇప్పటి వరకు బ్రిడ్జిలు, టన్నెల్లు, ఎలివేటెడ్ రోడ్లు, ఫ్లైఓవర్లు లాంటి ఖరీదైన నిర్మాణాలు ఉన్న హైవేలపై ఎక్కువ టోల్ వసూలు చేసేవారు. టోల్ లెక్కించే సమయంలో ఇలాంటి నిర్మాణాల ప్రతి 1 కిలోమీటర్‌ను సాధారణ హైవే 10 కిలోమీటర్లుగా పరిగణించేవారు. కారణం, వీటి నిర్మాణం, నిర్వహణ ఖర్చులు సాధారణ రోడ్లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండటమే. ఉదాహరణకు, ఎలివేటెడ్ రోడ్ లేదా టన్నెల్ పొడవు 10 కిలోమీటర్లు ఉంటే, పాత నిబంధన ప్రకారం టోల్ లెక్కించే దూరం 10 × 10 = 100 కిలోమీటర్లుగా తీసుకునేవారు. దీంతో ఎలివేటెడ్ రోడ్ లేదా టన్నెల్ అసలు పొడవు తక్కువగా ఉన్నా కూడా వాహనదారులు ఎక్కువ టోల్ చెల్లించాల్సి వచ్చేది. (ప్రతీకాత్మక చిత్రం)

