గుజరాత్ కు చెందిన డాక్టర్ బోహ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం చాలా మంది సూర్యరశ్మికి దూరంగా ఉండటం వల్ల శరీరంలో విటమిన్-డి లోపం పెరుగుతోంది. దానికి తోడు కాల్షియం కొరత, గంటల తరబడి కూర్చునే అలవాటు, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యం వంటి అలవాట్లు మోకాళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ కలిసి ఎముకలు, కండరాలను బలహీనపరచి మోకాళ్లపై అధిక ఒత్తిడిని పెంచడంతో అవి వేగంగా అరిగిపోతున్నాయని ఆయన వివరించారు.

