ప్రభన్యూస్

Heroines: నేటితరం హీరోయిన్లకు సోషల్ మీడియా శాపంగా మారిందా? ఒక్కొక్కరుగా క్విట్.. ఎందుకింత వణికిపోతున్నారు? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకుంటూ డబ్బులు వెనకేసిన అందాల భామలు.. ఇప్పుడు సోషల్ మీడియా అనగానే బాణోయ్ మాకొద్దు అంటున్నారు. సామజిక మాద్యమాల నుంచి ఒక్కొక్కరుగా క్విట్ అవుతున్నారు. అందుకు కారణాలేంటో చూస్తే..

News18
News18

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది సెలబ్రిటీలకు, ముఖ్యంగా హీరోయిన్లకు ఒక కత్తిమీద సాములా మారింది. ఒకప్పుడు అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి, సినిమా ప్రమోషన్లకు ఇది అద్భుతమైన వేదికగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్ లాంటి వేదికల ద్వారా వచ్చే లాభాల కంటే నెగిటివిటీ వల్లే నష్టాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరంతర ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలతో.. ప్రశాంతంగా ఉండే తమ జీవితాలను సోషల్ మీడియా తీవ్రంగా డిస్టర్బ్ చేస్తోందని, అందుకే బ్రేక్స్ తీసుకుంటున్నామని బాహాటంగానే చెబుతున్నారు.

నిజానికి సోషల్ మీడియాలో నెగిటివిటీ హద్దులు దాటుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత మార్ఫింగ్ ఫోటోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మిస్ యూజ్ (డీప్‌ఫేక్ వీడియోలు), పర్సనల్ టార్గెటింగ్‌తో హీరోయిన్లు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ వ్యవహారంపై స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. “నాకు 100 కోట్లు ఇచ్చినా సరే మళ్లీ సోషల్ మీడియా వైపు కన్నెత్తి కూడా చూడను” అని ఆమె తెగేసి చెప్పడం అక్కడ జరుగుతున్న సైబర్ వేధింపులకు అద్దం పడుతోంది.

డిజిటల్ డిటాక్స్ (Digital Detox) దిశగా యువతారలు:

ఇటీవల కాలంలో నెగిటివిటీని భరించలేక సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్న బ్యూటీస్ సంఖ్య పెరుగుతోంది. ‘ప్రేమలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన మమితా బైజు సైతం తన సోషల్ మీడియా ఖాతాలకు విరామం ప్రకటించారు. సౌత్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, కెరీర్ పరంగా డిజిటల్ ప్రెజెన్స్ ముఖ్యం అని తెలిసినా, మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తన సినిమా అప్‌డేట్స్ అన్నీ తన టీమ్ మాత్రమే కవర్ చేస్తోందని మమిత స్పష్టం చేశారు.

హీరోయిన్స్ ఇలా ఉన్నట్టుండి సోషల్ మీడియాకు దూరం కావడం ఇదే తొలిసారి కాదు. ‘ప్యారడైజ్’తో పాటు మరో నాలుగు వరుస సినిమాలతో బిజీగా ఉన్న కయాదు లోహర్ కూడా తనకు ప్రైవేట్ స్పేస్ కావాలంటూ సోషల్ మీడియాకు దూరం జరిగారు. మనశ్శాంతి కోసం, సోషల్ మీడియాలో నిండిపోయిన విద్వేషాలను దూరం చేసుకోడానికే యువ తారలు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఏది ఏమైనా, వర్చువల్ ప్రపంచంలోని ఫేక్ పాపులారిటీ కంటే రియల్ లైఫ్‌లోని ప్రశాంతతే ముఖ్యమని ఈ బ్యూటీస్ గట్టిగా నమ్ముతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 12:23 pm Digital Edition : Prabhanews
Heroines: నేటితరం హీరోయిన్లకు సోషల్ మీడియా శాపంగా మారిందా? ఒక్కొక్కరుగా క్విట్.. ఎందుకింత వణికిపోతున్నారు? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 24, 2026 12:17 PM ISTఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకుంటూ డబ్బులు వెనకేసిన అందాల భామలు.. ఇప్పుడు సోషల్ మీడియా అనగానే బాణోయ్ మాకొద్దు అంటున్నారు. సామజిక మాద్యమాల నుంచి ఒక్కొక్కరుగా క్విట్ అవుతున్నారు. అందుకు కారణాలేంటో చూస్తే.. News18ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది సెలబ్రిటీలకు, ముఖ్యంగా హీరోయిన్లకు ఒక కత్తిమీద సాములా మారింది. ఒకప్పుడు అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి, సినిమా ప్రమోషన్లకు ఇది అద్భుతమైన వేదికగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్ లాంటి వేదికల ద్వారా వచ్చే లాభాల కంటే నెగిటివిటీ వల్లే నష్టాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరంతర ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలతో.. ప్రశాంతంగా ఉండే తమ జీవితాలను సోషల్ మీడియా తీవ్రంగా డిస్టర్బ్ చేస్తోందని, అందుకే బ్రేక్స్ తీసుకుంటున్నామని బాహాటంగానే చెబుతున్నారు.నిజానికి సోషల్ మీడియాలో నెగిటివిటీ హద్దులు దాటుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత మార్ఫింగ్ ఫోటోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మిస్ యూజ్ (డీప్‌ఫేక్ వీడియోలు), పర్సనల్ టార్గెటింగ్‌తో హీరోయిన్లు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ వ్యవహారంపై స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. "నాకు 100 కోట్లు ఇచ్చినా సరే మళ్లీ సోషల్ మీడియా వైపు కన్నెత్తి కూడా చూడను" అని ఆమె తెగేసి చెప్పడం అక్కడ జరుగుతున్న సైబర్ వేధింపులకు అద్దం పడుతోంది.డిజిటల్ డిటాక్స్ (Digital Detox) దిశగా యువతారలు:ఇటీవల కాలంలో నెగిటివిటీని భరించలేక సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్న బ్యూటీస్ సంఖ్య పెరుగుతోంది. 'ప్రేమలు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన మమితా బైజు సైతం తన సోషల్ మీడియా ఖాతాలకు విరామం ప్రకటించారు. సౌత్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, కెరీర్ పరంగా డిజిటల్ ప్రెజెన్స్ ముఖ్యం అని తెలిసినా, మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తన సినిమా అప్‌డేట్స్ అన్నీ తన టీమ్ మాత్రమే కవర్ చేస్తోందని మమిత స్పష్టం చేశారు.హీరోయిన్స్ ఇలా ఉన్నట్టుండి సోషల్ మీడియాకు దూరం కావడం ఇదే తొలిసారి కాదు. 'ప్యారడైజ్'తో పాటు మరో నాలుగు వరుస సినిమాలతో బిజీగా ఉన్న కయాదు లోహర్ కూడా తనకు ప్రైవేట్ స్పేస్ కావాలంటూ సోషల్ మీడియాకు దూరం జరిగారు. మనశ్శాంతి కోసం, సోషల్ మీడియాలో నిండిపోయిన విద్వేషాలను దూరం చేసుకోడానికే యువ తారలు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఏది ఏమైనా, వర్చువల్ ప్రపంచంలోని ఫేక్ పాపులారిటీ కంటే రియల్ లైఫ్‌లోని ప్రశాంతతే ముఖ్యమని ఈ బ్యూటీస్ గట్టిగా నమ్ముతున్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,TelanganaFirst Published :Jul 24, 2026 12:17 PM ISTమరింత చదవండి

Source link