Last Updated:
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. బుధవారం భారీగా జంప్ అయిన బంగారం, వెండి ధరలు గురువారం నేలచూపులు చూశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న అనిశ్చితి, పలు దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల విధానాలపై నెలకొన్న సందిగ్ధత, అలాగే పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనాలైన బంగారం, వెండి వైపు ఎక్కువగా మొగ్గు చూపడం వంటి కారణాలతో విలువైన లోహాల ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే గురువారం మాత్రం ప్రాఫిట్ బుకింగ్ వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు ఎంసీక్స్లో పతనం అయ్యాయి.
అదే సమయంలో, bullions.co.in విడుదల చేసిన హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా ధరల ప్రకారం, స్పాట్ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పతనం అయ్యాయి. గత మార్కెట్ ముగింపు ధరలతో పోల్చితే బంగారం, వెండి రెండింటిలోనూ గణనీయమైన తగ్గుదల నమోదైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.490 తగ్గి రూ.1,45,880కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ.1,33,723 వద్ద కొనసాగుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు గతంతో పోలిస్తే మరింత ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గాయి. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండిపై రూ.720 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,26,970 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి రెండూ ఒకేసారి భారీగా పడటం బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ లాంటిది. అయితే ఈ తగ్గుదల కొనసాగుతుందా లేదంటే మళ్లీ ఆకాశానికి పెరుగుతుందా అనేది చూడాలి.
ఉదయం 9:05 నిమిషాలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్స్ రెండూ తగ్గాయి.
ప్రస్తుతం ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,45,200 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.480 తగ్గుదల. ఇక వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,26,528 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.470 తగ్గింది.
Hyderabad,Telangana

