ప్రభన్యూస్

Telangana: వరంగల్ విమానాశ్రయం అభివృద్ధికి రూ.496.89 కోట్లు! రాజ్యసభలో తెలంగాణ ఎంపీ ప్రశ్నలకు మంత్రి సమాధానాలు | తెలంగాణ వార్తలు


అభివృద్ధి పనుల పురోగతి – భూసేకరణే కీలకం

ఈనాడు కథనం ప్రకారం.. వరంగల్ విమానాశ్రయ నిర్మాణం ఎప్పటిలోపు పూర్తవుతుందనే కోణంలో మాట్లాడిన కేంద్రమంత్రి, ఈ ప్రాజెక్ట్ వేగం అనేది ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సిన భూసేకరణ, చట్టబద్ధమైన అనుమతుల సమీకరణ, ల్యాండ్ ఫిల్లింగ్ (భూమి సమతలీకరణ) పనులపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. విమానాశ్రయానికి అవసరమైన స్థలాన్ని కేటాయించి ఏఏఐకి అప్పగిస్తే, పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా రవాణా సేవలను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

ఇతర విమానాశ్రయ ప్రతిపాదనలపై కేంద్రం స్పష్టత

తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ప్రతిపాదిత విమానాశ్రయాలపై కూడా కేంద్ర మంత్రి సభలో వివరాలను అందించారు.

ఆదిలాబాద్ విమానాశ్రయం: ఆదిలాబాద్‌లోని రన్ వేను ఎయిర్‌ఫోర్స్, సివిల్ ఏవియేషన్ రవాణా కోసం ఉమ్మడిగా ఉపయోగించుకునే ప్రతిపాదనలపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో చర్చలు ఇంకా పూర్తి కావాల్సి ఉందని తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం సమీపంలోని రమణపాడు, మంచాలపల్లి, సుజాతనగర్ గ్రామాల్లో స్థలాలను ఏఏఐ (AAI) బృందం పరిశీలించింది. ప్రీ-ఫిజిబిలిటీ స్టడీ (Pre-feasibility study) నిర్వహించగా, రవాణా, సాంకేతిక కోణాల్లో ఆ స్థలాలు విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా లేవని తేలింది.

ఉడాన్ స్కీమ్ ప్రయోజనాలు: రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (UDAN) కింద తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు 56 వైమానిక మార్గాలు (Air Routes) అందుబాటులోకి వచ్చాయని వివరించారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊతం

హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్‌కు విమానాశ్రయం రావడం వల్ల విప్లవాత్మక మార్పులు రానున్నాయి. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఐటీ కారిడార్, వైద్య మరియు విద్యారంగాలకు ఈ కనెక్టివిటీ గొప్ప వరం కానుంది. విదేశీ పెట్టుబడులు రావడం మాత్రమే కాకుండా, పర్యాటకంగానూ వరంగల్ రూపురేఖలు మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులతో మామునూరు విమానాశ్రయం త్వరలోనే వాణిజ్య విమాన రాకపోకలతో కలకలలాడనుందని ప్రాంతీయ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త’మెట్రో’ ప్రాజెక్టులకు అనుమతుల్లేవు

తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైలు ప్రాజెక్టులకూ అనుమతివ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల గురించి సోమవారం రాజ్యసభలో వైకాపా సభ్యులు ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చారు. “దేశవ్యాప్తంగా 28 నగరాల్లో 1,159 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను ‘హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్’ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో అమలు చేసింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర రైల్వే బడ్జెట్ ద్వారా రూ.1,204 కోట్లు విడుదల చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి మెట్రో ప్రాజెక్టు అమల్లో లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయమూ చేయలేము” అని చెప్పారు.

ఐఐఎం ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది: కేంద్రం

హైదరాబాద్‌లో ఐఐఎం మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తమను కోరిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. “ప్రస్తుతం దేశంలోని 21 రాష్ట్రాల్లో 22 ఐఐఎంలు ఉన్నాయి. తెలంగాణ సహా 7 రాష్ట్రాలలో ఐఐఎంలు ఏర్పాటు చేయలేదు. హైదరాబాద్‌కు దీన్ని మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది” అని కేంద్రమంత్రి వివరించారు.

జల వివాదాల పరిష్కారానికి కమిటీ

కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం ఛైర్మన్ అధ్యక్షతన 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి తెలిపారు. నీటి నిర్వహణకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో భాజపా ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

న్యాయ వివాదంలో ‘కుతుబ్‌షాహీ’ అభివృద్ధి ప్రాజెక్ట్

కుతుబ్‌షాహీ పార్క్స్, ‘హైగా’ టూర్స్- హెరిటేజ్ బైక్ మసీదు డెవలప్‌మెంట్ అభివృద్ధి ప్రాజెక్టు న్యాయ వివాదంలో చిక్కుకున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద మంజూరైన ఈ ప్రాజెక్టుల నిధుల విడుదల గురించి సోమవారం లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు రఘువీర్ పటేల్, ఈటల రాజేందర్, సురేష్ శెట్టి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. “ఈ కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్స్ ప్రాజెక్టును స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద వారసత్వ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2017-18లో రూ.98.90 కోట్లు మంజూరు చేసి రూ.70.61 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తాన్ని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఖర్చు చేసింది. మిగిలిన రూ.28.29 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే ప్రస్తుతం ఆ భూమి హక్కుల వివాదానికి సంబంధించి అంశం ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది” అని షెకావత్ వెల్లడించారు.

తెలంగాణలో టీచర్ల సంఖ్య 1,59,178..

“తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 1,59,178 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 49,887 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 14,303 మంది, మాధ్యమిక పాఠశాలల్లో 60,203 మంది, హయ్యర్‌సెకండరీ పాఠశాలల్లో 37,002 మంది పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 51,34,621 మంది టీచర్లలో తెలంగాణ వాటా 3.04%గా ఉంది” అని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాలు వెల్లడించారు.

ఏడేళ్లలో 45లక్షల మందికి రుణాలు

ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద తెలంగాణలో 2016-27 మధ్యకాలంలో మొత్తం 30,31,257 మందికి రూ.80,977.25 కోట్ల రుణాలు అందించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. నిజాలాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. “ఇందులో 9,83,500 మంది ఎస్సీలకు రూ.5,826.14 కోట్లు, 4,58,277 మంది ఎస్టీలకు రూ.3,981.23 కోట్లు, 24,01,826 మంది ఓబీసీలకు రూ.36,351.40 కోట్ల రుణాలు మంజూరు చేశాం. మొత్తంగా 45,38,166 మంది మహిళలకు కలిపి రూ.25,573 కోట్ల రుణం అందించాం” అని కేంద్రమంత్రి వెల్లడించారు.

యుద్ధ నేపథ్యంలోనూ.. దేశానికి నగదు రాక..

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముతున్నా.. విదేశాల్లో ఉంటున్న భారతీయుల నుండి స్వదేశానికి వచ్చే డబ్బు మాత్రం తగ్గలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి దేశంలోకి వచ్చిన సొమ్ము 2024-25లో 124.6 బిలియన్ డాలర్ల మేర ఉండగా.. 2025-26లో అది 144.8 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. 2025 ఏప్రిల్లో నికరంగా 9.4 బిలియన్ డాలర్లు రాగా, 2026 ఏప్రిల్లో అది 18 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు చెప్పారు. సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. గ్లోబల్ బ్యాంక్ నివేదిక ప్రకారం పేద, దిగువ రాబడి ఉన్న ప్రైవేటు వ్యక్తుల నుండి వచ్చే సొమ్ము స్థిరంగా ఉన్నట్లు చెప్పారు. ఆదిత్య దేశాల్లో లేబర్ మార్కెట్ పరిస్థితులు స్థిరంగా ఉండటంలో ఇందుకు తోడ్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 9:05 am Digital Edition : Prabhanews
Telangana: వరంగల్ విమానాశ్రయం అభివృద్ధికి రూ.496.89 కోట్లు! రాజ్యసభలో తెలంగాణ ఎంపీ ప్రశ్నలకు మంత్రి సమాధానాలు | తెలంగాణ వార్తలు

అభివృద్ధి పనుల పురోగతి – భూసేకరణే కీలకంఈనాడు కథనం ప్రకారం.. వరంగల్ విమానాశ్రయ నిర్మాణం ఎప్పటిలోపు పూర్తవుతుందనే కోణంలో మాట్లాడిన కేంద్రమంత్రి, ఈ ప్రాజెక్ట్ వేగం అనేది ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సిన భూసేకరణ, చట్టబద్ధమైన అనుమతుల సమీకరణ, ల్యాండ్ ఫిల్లింగ్ (భూమి సమతలీకరణ) పనులపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. విమానాశ్రయానికి అవసరమైన స్థలాన్ని కేటాయించి ఏఏఐకి అప్పగిస్తే, పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా రవాణా సేవలను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.ఇతర విమానాశ్రయ ప్రతిపాదనలపై కేంద్రం స్పష్టతతెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ప్రతిపాదిత విమానాశ్రయాలపై కూడా కేంద్ర మంత్రి సభలో వివరాలను అందించారు.ఆదిలాబాద్ విమానాశ్రయం: ఆదిలాబాద్‌లోని రన్ వేను ఎయిర్‌ఫోర్స్, సివిల్ ఏవియేషన్ రవాణా కోసం ఉమ్మడిగా ఉపయోగించుకునే ప్రతిపాదనలపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో చర్చలు ఇంకా పూర్తి కావాల్సి ఉందని తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం సమీపంలోని రమణపాడు, మంచాలపల్లి, సుజాతనగర్ గ్రామాల్లో స్థలాలను ఏఏఐ (AAI) బృందం పరిశీలించింది. ప్రీ-ఫిజిబిలిటీ స్టడీ (Pre-feasibility study) నిర్వహించగా, రవాణా, సాంకేతిక కోణాల్లో ఆ స్థలాలు విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా లేవని తేలింది.ఉడాన్ స్కీమ్ ప్రయోజనాలు: రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (UDAN) కింద తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు 56 వైమానిక మార్గాలు (Air Routes) అందుబాటులోకి వచ్చాయని వివరించారు.తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊతంహైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్‌కు విమానాశ్రయం రావడం వల్ల విప్లవాత్మక మార్పులు రానున్నాయి. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఐటీ కారిడార్, వైద్య మరియు విద్యారంగాలకు ఈ కనెక్టివిటీ గొప్ప వరం కానుంది. విదేశీ పెట్టుబడులు రావడం మాత్రమే కాకుండా, పర్యాటకంగానూ వరంగల్ రూపురేఖలు మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులతో మామునూరు విమానాశ్రయం త్వరలోనే వాణిజ్య విమాన రాకపోకలతో కలకలలాడనుందని ప్రాంతీయ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కొత్త'మెట్రో' ప్రాజెక్టులకు అనుమతుల్లేవుతెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైలు ప్రాజెక్టులకూ అనుమతివ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల గురించి సోమవారం రాజ్యసభలో వైకాపా సభ్యులు ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చారు. "దేశవ్యాప్తంగా 28 నగరాల్లో 1,159 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను ‘హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్’ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో అమలు చేసింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర రైల్వే బడ్జెట్ ద్వారా రూ.1,204 కోట్లు విడుదల చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి మెట్రో ప్రాజెక్టు అమల్లో లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయమూ చేయలేము" అని చెప్పారు.ఐఐఎం ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది: కేంద్రంహైదరాబాద్‌లో ఐఐఎం మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తమను కోరిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. "ప్రస్తుతం దేశంలోని 21 రాష్ట్రాల్లో 22 ఐఐఎంలు ఉన్నాయి. తెలంగాణ సహా 7 రాష్ట్రాలలో ఐఐఎంలు ఏర్పాటు చేయలేదు. హైదరాబాద్‌కు దీన్ని మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది" అని కేంద్రమంత్రి వివరించారు.జల వివాదాల పరిష్కారానికి కమిటీకృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం ఛైర్మన్ అధ్యక్షతన 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి తెలిపారు. నీటి నిర్వహణకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో భాజపా ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.న్యాయ వివాదంలో 'కుతుబ్‌షాహీ' అభివృద్ధి ప్రాజెక్ట్కుతుబ్‌షాహీ పార్క్స్, 'హైగా' టూర్స్- హెరిటేజ్ బైక్ మసీదు డెవలప్‌మెంట్ అభివృద్ధి ప్రాజెక్టు న్యాయ వివాదంలో చిక్కుకున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద మంజూరైన ఈ ప్రాజెక్టుల నిధుల విడుదల గురించి సోమవారం లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు రఘువీర్ పటేల్, ఈటల రాజేందర్, సురేష్ శెట్టి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. "ఈ కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్స్ ప్రాజెక్టును స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద వారసత్వ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2017-18లో రూ.98.90 కోట్లు మంజూరు చేసి రూ.70.61 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తాన్ని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఖర్చు చేసింది. మిగిలిన రూ.28.29 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే ప్రస్తుతం ఆ భూమి హక్కుల వివాదానికి సంబంధించి అంశం ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది" అని షెకావత్ వెల్లడించారు.తెలంగాణలో టీచర్ల సంఖ్య 1,59,178.."తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 1,59,178 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 49,887 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 14,303 మంది, మాధ్యమిక పాఠశాలల్లో 60,203 మంది, హయ్యర్‌సెకండరీ పాఠశాలల్లో 37,002 మంది పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 51,34,621 మంది టీచర్లలో తెలంగాణ వాటా 3.04%గా ఉంది" అని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాలు వెల్లడించారు.ఏడేళ్లలో 45లక్షల మందికి రుణాలుప్రధాన మంత్రి ముద్రా యోజన కింద తెలంగాణలో 2016-27 మధ్యకాలంలో మొత్తం 30,31,257 మందికి రూ.80,977.25 కోట్ల రుణాలు అందించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. నిజాలాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. "ఇందులో 9,83,500 మంది ఎస్సీలకు రూ.5,826.14 కోట్లు, 4,58,277 మంది ఎస్టీలకు రూ.3,981.23 కోట్లు, 24,01,826 మంది ఓబీసీలకు రూ.36,351.40 కోట్ల రుణాలు మంజూరు చేశాం. మొత్తంగా 45,38,166 మంది మహిళలకు కలిపి రూ.25,573 కోట్ల రుణం అందించాం" అని కేంద్రమంత్రి వెల్లడించారు.యుద్ధ నేపథ్యంలోనూ.. దేశానికి నగదు రాక..పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముతున్నా.. విదేశాల్లో ఉంటున్న భారతీయుల నుండి స్వదేశానికి వచ్చే డబ్బు మాత్రం తగ్గలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి దేశంలోకి వచ్చిన సొమ్ము 2024-25లో 124.6 బిలియన్ డాలర్ల మేర ఉండగా.. 2025-26లో అది 144.8 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. 2025 ఏప్రిల్లో నికరంగా 9.4 బిలియన్ డాలర్లు రాగా, 2026 ఏప్రిల్లో అది 18 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు చెప్పారు. సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. గ్లోబల్ బ్యాంక్ నివేదిక ప్రకారం పేద, దిగువ రాబడి ఉన్న ప్రైవేటు వ్యక్తుల నుండి వచ్చే సొమ్ము స్థిరంగా ఉన్నట్లు చెప్పారు. ఆదిత్య దేశాల్లో లేబర్ మార్కెట్ పరిస్థితులు స్థిరంగా ఉండటంలో ఇందుకు తోడ్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

Source link