Last Updated:
Mana Illu Mana Lokesh: మంత్రి నారా లోకేష్.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి సమస్యల్ని తీర్చుతున్నారు. తాజాగా ఆయన ఇంటి పట్టాల పంపిణీ చేపట్టబోతున్నారు.
నేడు (జులై 21) మంగళగిరి నియోజకవర్గంలో ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం రెండో విడత ప్రారంభమవుతోంది. ఈ కార్యక్రమంలో సుమారు 2,700 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు ఇస్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కార్పొరేషన్ కమిషనర్ అలీం భాషా దీనిపై స్పందించారు. ఈనెల 21, 22 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జీవో ఎంఎస్ నెంబర్ 30 ప్రకారం రెండో విడతలో 150 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉంటున్న సుమారు 1,000 మందికి, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన 81 మందికి, 22A నిషేధిత భూముల్లో నివాసం ఉంటున్న 1,622 మందికి పట్టాలు ఇస్తారు. ఈ పట్టాల మొత్తం విలువ సుమారు రూ.1,000 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారని ఈటీవీ భారత్ రిపోర్ట్ చేసింది.
మంత్రి నారా లోకేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న పేదలకు శాశ్వత హక్కులు కల్పించడం ఇందులో ముఖ్య లక్ష్యం. తొలి విడతలో ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో 3,000 మందికి పైగా పట్టాలు ఇచ్చారు. రెండో విడతలో కూడా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి స్వయంగా కొత్త వస్త్రాలు, మహిళలకు పసుపు-కుంకుమలు ఇచ్చి, పట్టాలు ఇస్తారని అధికారులు తెలిపారు.
మంగళగిరి నియోజకవర్గంలో ఈ సమస్య దశాబ్దాలుగా ఉండటం వల్ల లబ్ధిదారులు ఎన్నో కష్టాలు పడ్డారు. లోకేశ్ యువగళం పాదయాత్ర సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ భూములపై స్పష్టమైన హక్కులు ఏర్పడటం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు తగ్గుతాయని అధికారులు అంటున్నారు.
ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి ఉదాహరణగా నిలుస్తుందనుకోవచ్చు. లోకేశ్ నాయకత్వంలో ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని జరుగుతాయని ఆశిస్తున్నారు. లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Hyderabad,Telangana

