పెరిగిన రద్దీ.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వేలోని దక్షిణ తీర రైల్వే డివిజన్ కొన్ని గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జులై 23న కాచిగూడ నుంచి తిరుచానూరుకూ, తిరిగి జులై 24న తిరుచానూరు నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే ఆగస్టు 14, 21, 28 తేదీల్లో కొల్లం నుంచి చర్లపల్లికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
రైళ్లు ఆగే స్టేషన్ల వివరాలు:
కాచిగూడ – తిరుచానూరు రైలు: మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
కొల్లం – చర్లపల్లి రైలు: నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనాస్సేరి, తిరువల్లా, చెంగన్నూర్, మావేలిక్కర, కాయంకుళం, కరుణాగప్పల్లి స్టేషన్లలో ఆగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
