ప్రభన్యూస్

Ramayana Movie: బాక్సాఫీస్ దగ్గర ‘రామాయణ’ విధ్వంసం.. ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్..   | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

Ramayana Collections: నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ నటించిన ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 22 రోజుల్లోనే ₹1,777 కోట్ల వసూళ్లతో ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు ‘బాహుబలి 2’ రికార్డుకు కేవలం ₹11 కోట్ల దూరంలో నిలిచింది. పూర్తి వివరాలు ఇవే…

News18
News18

Ramayana Box Office Collections: నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటించిన భారీ విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నవంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, విడుదలైన 22 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹1,777 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ఈ వసూళ్లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప 2’ (₹1,742 కోట్లు) లైఫ్ టైమ్ రికార్డును అధిగమించి ఆల్‌టైమ్ టాప్-4లోకి దూసుకెళ్లింది.

బాక్సాఫీస్ లెక్కల జాతర.. ఇండియాలో ₹1,000 కోట్ల నెట్ మార్క్ వైపు పరుగు: మూడో వారం ముగిసేసరికి ఈ సినిమా వసూళ్ల పరంగా సరికొత్త మైలురాళ్లను దాటుతోంది:

వరల్డ్ వైడ్ గ్రాస్: 22 రోజుల్లో ఇండియా గ్రాస్ ₹1,185 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్లో ఏకంగా ₹592 కోట్లు రాబట్టి మొత్తం ₹1,777 కోట్ల మార్క్ చేరుకుంది. అంతేకాకుండా 27 దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

ఇండియాలో ఇప్పటివరకు ₹992.10 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ చిత్రం, 23వ రోజు వసూళ్లతో ₹1,000 కోట్ల నెట్ క్లబ్‌లో చేరేందుకు సిద్ధమైంది. హిందీ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్థిరమైన వసూళ్లను రాబడుతోంది.

నెక్స్ట్ టార్గెట్ ‘బాహుబలి 2’.. రికార్డు బద్దలవుతుందా? ప్రస్తుతం ఆల్‌టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సినిమాల జాబితాలో ‘రామాయణ: పార్ట్ 1’ నాలుగో స్థానంలో నిలిచింది. దీని కంటే ముందు ‘దంగల్’ (₹2,070.30 కోట్లు), ‘ధురంధర్ 2: ది రివెంజ్’ (₹1,813.39 కోట్లు), ‘బాహుబలి 2’ (₹1,788.06 కోట్లు) ఉన్నాయి. రాజమౌళి ‘బాహుబలి 2’ రికార్డును దాటడానికి ‘రామాయణ’కు కేవలం ₹11.06 కోట్లు మాత్రమే అవసరం కావడంతో, ఈ వీకెండ్‌లోనే ఆ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 9:42 pm Digital Edition : Prabhanews
Ramayana Movie: బాక్సాఫీస్ దగ్గర ‘రామాయణ’ విధ్వంసం.. ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్..   | తెలుగు సినిమా వార్తలు

Last Updated:November 27, 2026 9:31 PM ISTRamayana Collections: నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ నటించిన 'రామాయణ: పార్ట్ 1' బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 22 రోజుల్లోనే ₹1,777 కోట్ల వసూళ్లతో 'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు 'బాహుబలి 2' రికార్డుకు కేవలం ₹11 కోట్ల దూరంలో నిలిచింది. పూర్తి వివరాలు ఇవే...News18Ramayana Box Office Collections: నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటించిన భారీ విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నవంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, విడుదలైన 22 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹1,777 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ఈ వసూళ్లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప 2’ (₹1,742 కోట్లు) లైఫ్ టైమ్ రికార్డును అధిగమించి ఆల్‌టైమ్ టాప్-4లోకి దూసుకెళ్లింది.బాక్సాఫీస్ లెక్కల జాతర.. ఇండియాలో ₹1,000 కోట్ల నెట్ మార్క్ వైపు పరుగు: మూడో వారం ముగిసేసరికి ఈ సినిమా వసూళ్ల పరంగా సరికొత్త మైలురాళ్లను దాటుతోంది:వరల్డ్ వైడ్ గ్రాస్: 22 రోజుల్లో ఇండియా గ్రాస్ ₹1,185 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్లో ఏకంగా ₹592 కోట్లు రాబట్టి మొత్తం ₹1,777 కోట్ల మార్క్ చేరుకుంది. అంతేకాకుండా 27 దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.ఇండియాలో ఇప్పటివరకు ₹992.10 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ చిత్రం, 23వ రోజు వసూళ్లతో ₹1,000 కోట్ల నెట్ క్లబ్‌లో చేరేందుకు సిద్ధమైంది. హిందీ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్థిరమైన వసూళ్లను రాబడుతోంది.నెక్స్ట్ టార్గెట్ ‘బాహుబలి 2’.. రికార్డు బద్దలవుతుందా? ప్రస్తుతం ఆల్‌టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సినిమాల జాబితాలో ‘రామాయణ: పార్ట్ 1’ నాలుగో స్థానంలో నిలిచింది. దీని కంటే ముందు ‘దంగల్’ (₹2,070.30 కోట్లు), ‘ధురంధర్ 2: ది రివెంజ్’ (₹1,813.39 కోట్లు), ‘బాహుబలి 2’ (₹1,788.06 కోట్లు) ఉన్నాయి. రాజమౌళి ‘బాహుబలి 2’ రికార్డును దాటడానికి ‘రామాయణ’కు కేవలం ₹11.06 కోట్లు మాత్రమే అవసరం కావడంతో, ఈ వీకెండ్‌లోనే ఆ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.మరింత చదవండి

Source link