ప్రభన్యూస్

Trending: రష్యా అధ్యక్షుడు “పుతిన్‌”ను కలిసిన ఈ ‘ఏఐ కిడ్ ఆఫ్ ఇండియా’ గురించి తెలుసా? |


Last Updated:

తొమ్మిదేళ్ల వయసులో ఓ చిన్న వీడియోతో మొదలైన ప్రయాణం.. 12 ఏళ్లకే రోబో తయారీ.. ఇప్పుడు ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సెల్ఫీ! కేవలం 16 ఏళ్ల వయసులోనే ఏఐ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ భారత కుర్రాడు ఎవరు?

News18
News18

ప్రపంచ దేశాల అధినేతలను కలవడం పెద్దవారికే అరుదైన అవకాశం. అలాంటిది 16 ఏళ్ల వయసులోనే ఓ భారతీయ కుర్రాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యే అవకాశం దక్కింది. అంతేకాదు.. ఆయనతో కలిసి సెల్ఫీ కూడా దిగాడు. చిన్న వయసులోనే కృత్రిమ మేధ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ యువకుడిని ‘ఏఐ కిడ్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారు. తొమ్మిదేళ్ల వయసులో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు ప్రపంచస్థాయి వేదికకు చేరుకోవడంపై అతడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించాడు.

పుతిన్‌తో సెల్ఫీ.. ఆనందం పంచుకున్న యువకుడు

రాహుల్ జాన్ అజు (Raul John Aju) ఇటీవల మాస్కోలో జరిగిన ఏఐ జర్నీ 2026 సదస్సులో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో కృత్రిమ మేధ రంగానికి చెందిన పలువురు నిపుణులు, పరిశోధకులను కలుసుకున్నాడు. అదే సందర్భంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా కలిశాడు. ఆయనతో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తొమ్మిదేళ్ల వయసులో బాత్రూమ్‌లో తన మొదటి వీడియో రూపొందించినప్పటి నుంచి ఇప్పుడు పుతిన్‌తో ఫొటో దిగే స్థాయికి చేరుకోవడం తన ఊహకు కూడా అందని విషయమని పేర్కొన్నాడు. తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రముఖ ఏఐ పరిశోధకులను కలిసిన తర్వాత నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని అర్థమైందన్నాడు. సాధించిన విజయాలకంటే తన ప్రయాణంలో తోడ్పడిన వారిని గుర్తుచేసుకుంటూ, తాను ఇప్పటికీ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న చిన్న కుర్రాడినేనని చెప్పాడు.

చిన్న వయసులోనే రోబో.. సొంత ఏఐ సంస్థ

అజుకు సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి చిన్నప్పుడే మొదలైంది. అతడి తండ్రికి అడోబ్ సంస్థలో ఉద్యోగం రావడంతో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే అవకాశం లభించింది. వాటిని నేర్చుకుంటూ గంటల తరబడి గడిపేవాడు. అలా మొదలైన ఆసక్తి క్రమంగా ఏఐ వైపు మళ్లింది. 12 ఏళ్ల వయసులోనే తొలి రోబోను తయారు చేశాడు. ఇప్పటివరకు పది కంటే ఎక్కువ ఏఐ ఆధారిత సాధనాలపై పనిచేశాడు. అంతేకాదు, ‘ఏఐ రియల్మ్ టెక్నాలజీస్’ పేరుతో సొంత సంస్థను కూడా ప్రారంభించాడు. పాఠశాల సైన్స్ ప్రదర్శన కోసం రూపొందించిన ‘మీబాట్’ అతడి తొలి ప్రాజెక్టుల్లో ఒకటి.

ప్రభుత్వాలకు సలహాలు.. వ్యాపార నిర్వహణలో తండ్రి తోడు

ప్రజా సేవల్లో ఏఐ వినియోగంపై అజు సూచనలను కేరళ, దుబాయ్ ప్రభుత్వాలు కోరినట్లు ఐక్యరాజ్యసమితి వార్తా విభాగం వెల్లడించింది. డెబిట్, క్రెడిట్ కార్డులు లేని వారు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయగలిగే విధానాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పనిచేశాడు. 16 ఏళ్ల వయసులో సంస్థ నిర్వహణ సవాలుగా మారడంతో వ్యాపార నిర్ణయాలు, నిర్వహణలో తండ్రి సహాయం తీసుకుంటున్నాడు. అమెజాన్, అడోబ్, విప్రో, ఐబీఎం వంటి సంస్థల్లో పనిచేసిన తండ్రి అనుభవం తనకు ఎంతో ఉపయోగపడుతోందని అజు చెబుతున్నాడు. స్మార్ట్‌ఫోన్లలో సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ, నిజ జీవిత అనుభవానికి అవి ప్రత్యామ్నాయం కాలేవని అతడి అభిప్రాయం. తండ్రి సంస్థలో ఉండటం నిర్వహణకే కాకుండా మార్కెటింగ్‌కూ ఉపయోగపడుతోందని సరదాగా వ్యాఖ్యానించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 9:24 pm Digital Edition : Prabhanews
Trending: రష్యా అధ్యక్షుడు “పుతిన్‌”ను కలిసిన ఈ ‘ఏఐ కిడ్ ఆఫ్ ఇండియా’ గురించి తెలుసా? |

Last Updated:November 27, 2026 8:56 PM ISTతొమ్మిదేళ్ల వయసులో ఓ చిన్న వీడియోతో మొదలైన ప్రయాణం.. 12 ఏళ్లకే రోబో తయారీ.. ఇప్పుడు ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సెల్ఫీ! కేవలం 16 ఏళ్ల వయసులోనే ఏఐ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ భారత కుర్రాడు ఎవరు?
News18ప్రపంచ దేశాల అధినేతలను కలవడం పెద్దవారికే అరుదైన అవకాశం. అలాంటిది 16 ఏళ్ల వయసులోనే ఓ భారతీయ కుర్రాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యే అవకాశం దక్కింది. అంతేకాదు.. ఆయనతో కలిసి సెల్ఫీ కూడా దిగాడు. చిన్న వయసులోనే కృత్రిమ మేధ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ యువకుడిని ‘ఏఐ కిడ్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారు. తొమ్మిదేళ్ల వయసులో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు ప్రపంచస్థాయి వేదికకు చేరుకోవడంపై అతడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించాడు.పుతిన్‌తో సెల్ఫీ.. ఆనందం పంచుకున్న యువకుడురాహుల్ జాన్ అజు (Raul John Aju) ఇటీవల మాస్కోలో జరిగిన ఏఐ జర్నీ 2026 సదస్సులో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో కృత్రిమ మేధ రంగానికి చెందిన పలువురు నిపుణులు, పరిశోధకులను కలుసుకున్నాడు. అదే సందర్భంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా కలిశాడు. ఆయనతో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తొమ్మిదేళ్ల వయసులో బాత్రూమ్‌లో తన మొదటి వీడియో రూపొందించినప్పటి నుంచి ఇప్పుడు పుతిన్‌తో ఫొటో దిగే స్థాయికి చేరుకోవడం తన ఊహకు కూడా అందని విషయమని పేర్కొన్నాడు. తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రముఖ ఏఐ పరిశోధకులను కలిసిన తర్వాత నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని అర్థమైందన్నాడు. సాధించిన విజయాలకంటే తన ప్రయాణంలో తోడ్పడిన వారిని గుర్తుచేసుకుంటూ, తాను ఇప్పటికీ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న చిన్న కుర్రాడినేనని చెప్పాడు.చిన్న వయసులోనే రోబో.. సొంత ఏఐ సంస్థఅజుకు సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి చిన్నప్పుడే మొదలైంది. అతడి తండ్రికి అడోబ్ సంస్థలో ఉద్యోగం రావడంతో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే అవకాశం లభించింది. వాటిని నేర్చుకుంటూ గంటల తరబడి గడిపేవాడు. అలా మొదలైన ఆసక్తి క్రమంగా ఏఐ వైపు మళ్లింది. 12 ఏళ్ల వయసులోనే తొలి రోబోను తయారు చేశాడు. ఇప్పటివరకు పది కంటే ఎక్కువ ఏఐ ఆధారిత సాధనాలపై పనిచేశాడు. అంతేకాదు, ‘ఏఐ రియల్మ్ టెక్నాలజీస్’ పేరుతో సొంత సంస్థను కూడా ప్రారంభించాడు. పాఠశాల సైన్స్ ప్రదర్శన కోసం రూపొందించిన ‘మీబాట్’ అతడి తొలి ప్రాజెక్టుల్లో ఒకటి.ప్రభుత్వాలకు సలహాలు.. వ్యాపార నిర్వహణలో తండ్రి తోడుప్రజా సేవల్లో ఏఐ వినియోగంపై అజు సూచనలను కేరళ, దుబాయ్ ప్రభుత్వాలు కోరినట్లు ఐక్యరాజ్యసమితి వార్తా విభాగం వెల్లడించింది. డెబిట్, క్రెడిట్ కార్డులు లేని వారు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయగలిగే విధానాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పనిచేశాడు. 16 ఏళ్ల వయసులో సంస్థ నిర్వహణ సవాలుగా మారడంతో వ్యాపార నిర్ణయాలు, నిర్వహణలో తండ్రి సహాయం తీసుకుంటున్నాడు. అమెజాన్, అడోబ్, విప్రో, ఐబీఎం వంటి సంస్థల్లో పనిచేసిన తండ్రి అనుభవం తనకు ఎంతో ఉపయోగపడుతోందని అజు చెబుతున్నాడు. స్మార్ట్‌ఫోన్లలో సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ, నిజ జీవిత అనుభవానికి అవి ప్రత్యామ్నాయం కాలేవని అతడి అభిప్రాయం. తండ్రి సంస్థలో ఉండటం నిర్వహణకే కాకుండా మార్కెటింగ్‌కూ ఉపయోగపడుతోందని సరదాగా వ్యాఖ్యానించాడు.మరింత చదవండి

Source link