ఇదే తరహాలో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి కొల్లం వరకు మరో ప్రత్యేక రైలును కూడా నడపనున్నారు. 07171 నంబర్ గల సిర్పూర్ కాగజ్‌నగర్-కొల్లం ప్రత్యేక రైలు 2026 డిసెంబర్ 11, 25 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఈ రైలు బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం, కరునాగప్పల్లి, శాస్తాంకోట్ట స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

