దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నమోదైన ధరల పెరుగుదలను పరిశీలిస్తే, చెన్నై ఇళ్ల ధరల పెరుగుదలతో తొలి స్థానంలో నిలవగా, హైదరాబాద్ రెండో స్థానంలో, ఐటీ హబ్ బెంగళూరు మూడో స్థానంలో నిలిచాయి. అయితే, ఒకవైపు ధరలు భారీగా పెరుగుతుండగా, మరోవైపు కొనుగోలు డిమాండ్ స్పష్టంగా తగ్గుముఖం పట్టడం రియల్ ఎస్టేట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.

