ప్రభన్యూస్

RBI New Rules: ఏటీఎం నుంచి డబ్బులు తీసేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇక ఆ ఛార్జీలు ఉండవు.. | బిజినెస్


Last Updated:

ఏటీఎంలో నగదు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శకాలను తీసుకొచ్చింది. నెలకు ఎన్ని ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు? పరిమితి దాటితే ఎంత ఛార్జీ చెల్లించాలి? ఏటీఎంలో నగదు లేకపోతే లేదా సాంకేతిక సమస్యతో లావాదేవీ విఫలమైతే డబ్బులు కట్ చేయవచ్చా? అంతేకాదు, యూపీఐ ద్వారా పీఓఎస్ కేంద్రాల్లో నగదు తీసుకునే సదుపాయంపైనా స్పష్టత ఇచ్చింది. నవంబర్ 27న ప్రకటించిన ఈ కొత్త నిబంధనల్లో ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే!

News18
News18

RBI New ATM Rules 2026: బ్యాంకు ఖాతాదారులు ఏటీఎంలలో నగదు తీసుకునే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాల ద్వారా నగదు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలన్నింటినీ ఒకే మార్గదర్శకంలోకి తీసుకొచ్చింది. నవంబర్ 27న ఈ మేరకు మాస్టర్ డైరెక్షన్ జారీ చేసింది. 2008 నుంచి 2022 మధ్య విడుదల చేసిన 17 పాత సర్క్యులర్లను ఉపసంహరించుకుంది. కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అనుమతి పొందిన చెల్లింపు వ్యవస్థల నిర్వాహకులు, సంబంధిత సంస్థలకు ఇవి వర్తిస్తాయి.

ఉచిత లావాదేవీలు ఎన్ని చేశారో బ్యాంకులే చెప్పాలి

ఒక నెలలో ఖాతాదారుడు ఎన్ని ఉచిత ఏటీఎం లావాదేవీలు వినియోగించుకున్నారో బ్యాంకులు తెలియజేయాలి. ఉచిత పరిమితి దాటిన తర్వాత ఎంత ఛార్జీ పడుతుందో కూడా ముందుగానే హెచ్చరించాలి. ఏటీఎం మెట్రో ప్రాంతంలో ఉందా? ఇతర ప్రాంతంలో ఉందా? అనే వివరాలను తెరపై సందేశం, స్టిక్కర్ లేదా పోస్టర్ ద్వారా ప్రదర్శించాలి. ఈ వివరాలు బ్యాంకుల సమాచార వ్యవస్థల్లో ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఉచిత లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. సొంత బ్యాంకు ఏటీఎంలలో పొదుపు ఖాతాదారులకు నెలకు ఐదు ఉచిత లావాదేవీలు ఉంటాయి. ఇందులో నగదు ఉపసంహరణతో పాటు ఇతర లావాదేవీలూ కలుస్తాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో మూడు, మెట్రోయేతర ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. రెండు ప్రాంతాల్లోని ఏటీఎంలను కలిపి ఉపయోగించినా మొత్తం పరిమితి ఐదుకు మించకూడదు. బ్యాంకులు కావాలనుకుంటే అదనపు ఉచిత లావాదేవీలు కల్పించవచ్చు. పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.23కు మించి వసూలు చేయరాదు. దీనికి వర్తించే పన్నులు అదనం. ఛార్జీల కోసం బ్యాంకు బోర్డు ఆమోదించిన విధానం ఉండాలి.

విఫలమైన లావాదేవీలకు ఛార్జీలు ఉండవు

సాంకేతిక లోపాలు, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ సమస్యలు లేదా ఏటీఎంలో నగదు లేకపోవడం వల్ల విఫలమైన లావాదేవీలను వినియోగించిన లావాదేవీలుగా పరిగణించకూడదు. బ్యాంకు లేదా సేవలందించే సంస్థ తప్పిదం వల్ల, తప్పుడు పిన్ లేదా ధ్రువీకరణ సమస్యలతో తిరస్కరణ ఎదురైనా ఛార్జీలు విధించరాదు. ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణ గరిష్ఠ పరిమితి, ఉచిత లావాదేవీలు, ఛార్జీల వివరాలను ఇంగ్లిష్, హిందీ, స్థానిక భాషల్లో ప్రదర్శించాలి.

పీఓఎస్ కేంద్రాల్లోనూ యూపీఐ ద్వారా నగదు

డెబిట్ కార్డులు, పూర్తి కేవైసీ చేసిన ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు, యూపీఐ ద్వారా పీఓఎస్ యంత్రాల వద్ద నగదు తీసుకునే సదుపాయాన్ని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.2,000, అన్ని ప్రాంతాల్లో కలిపి నెలకు రూ.10,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. ఛార్జీలు వసూలు చేస్తే లావాదేవీ మొత్తంలో ఒక శాతానికి మించరాదు. కొనుగోలు చేసినా, చేయకపోయినా వ్యాపార కేంద్రాలు ఈ సదుపాయం కల్పించాలి. వస్తువులు కొంటూ నగదు తీసుకుంటే రసీదులో ఆ మొత్తాన్ని విడిగా చూపించాలి.

ఈ సేవలను బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం అందించాలి. వ్యాపార కేంద్రాల వివరాలను పరిశీలించాలి. సదుపాయం, ఛార్జీల వివరాలను వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలని వ్యాపారులకు సూచించవచ్చు. యూపీఐ ద్వారా ధ్రువీకరణ జరిగే కార్డు అవసరం లేని ఏటీఎం నగదు ఉపసంహరణ విధానాన్నీ కొనసాగించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం-2026, విఫలమైన లావాదేవీల పరిహార నిబంధనలు వర్తిస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 8:36 pm Digital Edition : Prabhanews
RBI New Rules: ఏటీఎం నుంచి డబ్బులు తీసేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇక ఆ ఛార్జీలు ఉండవు.. | బిజినెస్

Last Updated:November 27, 2026 8:24 PM ISTఏటీఎంలో నగదు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శకాలను తీసుకొచ్చింది. నెలకు ఎన్ని ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు? పరిమితి దాటితే ఎంత ఛార్జీ చెల్లించాలి? ఏటీఎంలో నగదు లేకపోతే లేదా సాంకేతిక సమస్యతో లావాదేవీ విఫలమైతే డబ్బులు కట్ చేయవచ్చా? అంతేకాదు, యూపీఐ ద్వారా పీఓఎస్ కేంద్రాల్లో నగదు తీసుకునే సదుపాయంపైనా స్పష్టత ఇచ్చింది. నవంబర్ 27న ప్రకటించిన ఈ కొత్త నిబంధనల్లో ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే!
News18RBI New ATM Rules 2026: బ్యాంకు ఖాతాదారులు ఏటీఎంలలో నగదు తీసుకునే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాల ద్వారా నగదు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలన్నింటినీ ఒకే మార్గదర్శకంలోకి తీసుకొచ్చింది. నవంబర్ 27న ఈ మేరకు మాస్టర్ డైరెక్షన్ జారీ చేసింది. 2008 నుంచి 2022 మధ్య విడుదల చేసిన 17 పాత సర్క్యులర్లను ఉపసంహరించుకుంది. కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అనుమతి పొందిన చెల్లింపు వ్యవస్థల నిర్వాహకులు, సంబంధిత సంస్థలకు ఇవి వర్తిస్తాయి.ఉచిత లావాదేవీలు ఎన్ని చేశారో బ్యాంకులే చెప్పాలిఒక నెలలో ఖాతాదారుడు ఎన్ని ఉచిత ఏటీఎం లావాదేవీలు వినియోగించుకున్నారో బ్యాంకులు తెలియజేయాలి. ఉచిత పరిమితి దాటిన తర్వాత ఎంత ఛార్జీ పడుతుందో కూడా ముందుగానే హెచ్చరించాలి. ఏటీఎం మెట్రో ప్రాంతంలో ఉందా? ఇతర ప్రాంతంలో ఉందా? అనే వివరాలను తెరపై సందేశం, స్టిక్కర్ లేదా పోస్టర్ ద్వారా ప్రదర్శించాలి. ఈ వివరాలు బ్యాంకుల సమాచార వ్యవస్థల్లో ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.ప్రస్తుతం అమల్లో ఉన్న ఉచిత లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. సొంత బ్యాంకు ఏటీఎంలలో పొదుపు ఖాతాదారులకు నెలకు ఐదు ఉచిత లావాదేవీలు ఉంటాయి. ఇందులో నగదు ఉపసంహరణతో పాటు ఇతర లావాదేవీలూ కలుస్తాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో మూడు, మెట్రోయేతర ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. రెండు ప్రాంతాల్లోని ఏటీఎంలను కలిపి ఉపయోగించినా మొత్తం పరిమితి ఐదుకు మించకూడదు. బ్యాంకులు కావాలనుకుంటే అదనపు ఉచిత లావాదేవీలు కల్పించవచ్చు. పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.23కు మించి వసూలు చేయరాదు. దీనికి వర్తించే పన్నులు అదనం. ఛార్జీల కోసం బ్యాంకు బోర్డు ఆమోదించిన విధానం ఉండాలి.విఫలమైన లావాదేవీలకు ఛార్జీలు ఉండవుసాంకేతిక లోపాలు, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ సమస్యలు లేదా ఏటీఎంలో నగదు లేకపోవడం వల్ల విఫలమైన లావాదేవీలను వినియోగించిన లావాదేవీలుగా పరిగణించకూడదు. బ్యాంకు లేదా సేవలందించే సంస్థ తప్పిదం వల్ల, తప్పుడు పిన్ లేదా ధ్రువీకరణ సమస్యలతో తిరస్కరణ ఎదురైనా ఛార్జీలు విధించరాదు. ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణ గరిష్ఠ పరిమితి, ఉచిత లావాదేవీలు, ఛార్జీల వివరాలను ఇంగ్లిష్, హిందీ, స్థానిక భాషల్లో ప్రదర్శించాలి.పీఓఎస్ కేంద్రాల్లోనూ యూపీఐ ద్వారా నగదుడెబిట్ కార్డులు, పూర్తి కేవైసీ చేసిన ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు, యూపీఐ ద్వారా పీఓఎస్ యంత్రాల వద్ద నగదు తీసుకునే సదుపాయాన్ని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.2,000, అన్ని ప్రాంతాల్లో కలిపి నెలకు రూ.10,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. ఛార్జీలు వసూలు చేస్తే లావాదేవీ మొత్తంలో ఒక శాతానికి మించరాదు. కొనుగోలు చేసినా, చేయకపోయినా వ్యాపార కేంద్రాలు ఈ సదుపాయం కల్పించాలి. వస్తువులు కొంటూ నగదు తీసుకుంటే రసీదులో ఆ మొత్తాన్ని విడిగా చూపించాలి.ఈ సేవలను బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం అందించాలి. వ్యాపార కేంద్రాల వివరాలను పరిశీలించాలి. సదుపాయం, ఛార్జీల వివరాలను వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలని వ్యాపారులకు సూచించవచ్చు. యూపీఐ ద్వారా ధ్రువీకరణ జరిగే కార్డు అవసరం లేని ఏటీఎం నగదు ఉపసంహరణ విధానాన్నీ కొనసాగించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం-2026, విఫలమైన లావాదేవీల పరిహార నిబంధనలు వర్తిస్తాయి.మరింత చదవండి

Source link