ప్రస్తుతం పరిశీలించిన కొన్ని ఎస్‌జీబీల ధరలను చూస్తే, ఎస్‌జీబీజేఏఎన్27 (SGBJAN27) బాండ్‌ను మొదట గ్రాముకు రూ.3,164 ధరకు జారీ చేశారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దీని ట్రేడింగ్ ధర గ్రాముకు రూ.12,150గా ఉంది. అంటే 10 గ్రాములకు రూ.1,21,500 ఖర్చవుతుంది. ఎస్‌జీబీజేయూఎన్28 (SGBJUN28) బాండ్ మొదటి జారీ ధర గ్రాముకు రూ.4,627 కాగా, ప్రస్తుతం ట్రేడవుతున్న ధర రూ.12,152. ఈ బాండ్‌లో 10 గ్రాములకు రూ.1,21,520 ఖర్చు చేయాలి. ఇక ఎస్‌జీబీఎస్ఈపీ28 (SGBSEP28) మొదటి జారీ ధర గ్రాముకు రూ.5,067 కాగా, ప్రస్తుతం ట్రేడవుతున్న ధర రూ.12,190. అంటే 10 గ్రాములకు రూ.1,21,900 చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మొదట జారీ చేసిన ధర అంటే ప్రభుత్వం బాండ్లను ప్రారంభంలో విక్రయించినప్పటి ధర. సెకండరీ మార్కెట్‌లో కొనుగోలు చేసేవారు మాత్రం అప్పటి ధర కాకుండా ప్రస్తుత మార్కెట్ ధరనే చెల్లించాలి. 10 గ్రాముల ఫిజికల్ గోల్డ్ కాయిన్ కొనడానికి సుమారు రూ.1,33,450 ఖర్చవుతుందని పరిగణనలోకి తీసుకుంటే, SGBJAN27 ద్వారా రూ.11,950, SGBJUN28 ద్వారా రూ.11,930, SGBSEP28 ద్వారా రూ.11,550 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ లెక్కల్లో బ్రోకరేజ్, ఎక్స్ఛేంజ్‌కు సంబంధించిన ఇతర ఛార్జీలు చేర్చలేదు. ఇవి కొనుగోలు సమయంలో కనిపించే ధరల వ్యత్యాసాలు మాత్రమే. వీటిని గ్యారంటీ రాబడిగా భావించకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)

