ఇదే సమయంలో బంగారం ధరలను పరిశీలిస్తే వెండితో పోలిస్తే తక్కువగానే ఉందని చెప్పుకోవాలి.. ఈ ఏడాది జనవరి 29న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,440గా ఉంది. నవంబర్ 25 నాటికి అది రూ.1,21,210కు దిగివచ్చింది. అంటే పది నెలల్లో 10 గ్రాముల బంగారంపై రూ.49,230 తగ్గింది. శాతం పరంగా చూస్తే 28.88 శాతం పతనమైంది. బంగారంతో పోలిస్తే వెండి ధరలు రెండింతలకు పైగా తగ్గడం మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో వెండి ధరల పతనం అనేది సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. పెళ్లిళ్ల సమయంలో వెండి మెట్టెలు, పూజా సామగ్రి, దేవుడి ప్రతిమలు, ఇతర వస్తువులను కొనుగోలు చేయడం సాధారణం. ధరలు భారీగా తగ్గడంతో గతంలో కొనుగోలు చేయడానికి వెనుకాడినవారు ఇప్పుడు వెండి వస్తువులపై ఆసక్తి చూపించే అవకాశం ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)

