Striker AI Film: విడుదలకు రెడీ అవుతున్న AI బేస్డ్ పాన్ ఇండియా ఫిలిం | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్ “స్ట్రైకర్” చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించారు. యూనివర్సల్ మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కిరణ్ కర్నీడి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

News18
News18

2003లో “తొలి పరిచయం” చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన “కిరణ్ కర్నీడి” 23 ఏళ్ల విరామం తర్వాత “స్ట్రైకర్” చిత్రంతో తన సత్తాను చాటుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నవంబర్ 25 తన పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో తను రూపొందించిన పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్ “స్ట్రైకర్” చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించారు. యూనివర్సల్ మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కిరణ్ కర్నీడి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విద్యాధికుడైన కిరణ్ కర్నీడి “గ్లామర్ టాప్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందించారు. ‘తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్” మరియు ‘తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’లో శాశ్వత సభ్యుడైన కిరణ్ కర్నీడి… మార్కెటింగ్ లో తనకు గల అపార అనుభవానికి- తనలోని సృజనాత్మకతను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి “స్ట్రైకర్” చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “స్ట్రైకర్” చిత్రం థియేటర్ రిలీజ్ కు అవసరమైన సాంకేతిక సన్నాహాలు చేసుకుంటోంది. సంప్రదాయ కమర్షియల్ సినిమా విలువలు కొనసాగిస్తూనే అద్భుత సాంకేతిక మాయాజాలంతో సినిమా నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించడం, ఈ రంగంలో కొత్త బాటలు వేయడం ఈ చిత్రం ప్రధాన ఉద్దేశం అని “స్ట్రైకర్” సృష్టికర్త కిరణ్ కర్నీడి చెబుతున్నారు.

శక్తివంతమైన సాంకేతికతకు- బలీయమైన భావోద్వేగాలు, కామెడీ సీన్స్ మేళవించి అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని “స్ట్రైకర్” చిత్రం అందిస్తుందని కిరణ్ కర్నీడి చెబుతున్నారు. ఈ మూవీ తెలుగు సినిమా రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టనుందని అంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 4:37 pm Digital Edition : Prabhanews
Striker AI Film: విడుదలకు రెడీ అవుతున్న AI బేస్డ్ పాన్ ఇండియా ఫిలిం | తెలుగు సినిమా వార్తలు

Last Updated:November 25, 2026 3:06 PM ISTఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్ "స్ట్రైకర్" చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించారు. యూనివర్సల్ మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కిరణ్ కర్నీడి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.News182003లో "తొలి పరిచయం" చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన "కిరణ్ కర్నీడి" 23 ఏళ్ల విరామం తర్వాత "స్ట్రైకర్" చిత్రంతో తన సత్తాను చాటుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నవంబర్ 25 తన పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో తను రూపొందించిన పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్ "స్ట్రైకర్" చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించారు. యూనివర్సల్ మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కిరణ్ కర్నీడి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.విద్యాధికుడైన కిరణ్ కర్నీడి "గ్లామర్ టాప్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్" సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందించారు. 'తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్" మరియు 'తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్'లో శాశ్వత సభ్యుడైన కిరణ్ కర్నీడి... మార్కెటింగ్ లో తనకు గల అపార అనుభవానికి- తనలోని సృజనాత్మకతను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి "స్ట్రైకర్" చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "స్ట్రైకర్" చిత్రం థియేటర్ రిలీజ్ కు అవసరమైన సాంకేతిక సన్నాహాలు చేసుకుంటోంది. సంప్రదాయ కమర్షియల్ సినిమా విలువలు కొనసాగిస్తూనే అద్భుత సాంకేతిక మాయాజాలంతో సినిమా నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించడం, ఈ రంగంలో కొత్త బాటలు వేయడం ఈ చిత్రం ప్రధాన ఉద్దేశం అని "స్ట్రైకర్" సృష్టికర్త కిరణ్ కర్నీడి చెబుతున్నారు.శక్తివంతమైన సాంకేతికతకు- బలీయమైన భావోద్వేగాలు, కామెడీ సీన్స్ మేళవించి అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని "స్ట్రైకర్" చిత్రం అందిస్తుందని కిరణ్ కర్నీడి చెబుతున్నారు. ఈ మూవీ తెలుగు సినిమా రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టనుందని అంటున్నారు.మరింత చదవండి

Source link