ప్రభన్యూస్

Gold Silver Prices Today: బంగారం కొనాలనుకునేవారికి అతి భారీ షాక్.. ఒక్కసారిగా వేలల్లో పెరిగిన ధరలు! | బిజినెస్


Last Updated:

Gold Silver Prices Today: బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా దిగివచ్చిన ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.2,000, కిలో వెండిపై దాదాపు రూ.6,000 పెరిగింది. తాజా ధరలు ఇలా ఉన్నాయి.

News18
News18

గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా మళ్లీ షాక్ ఇచ్చాయి. ధరలు తగ్గుతున్నాయని కొనుగోళ్లకు సిద్ధమవుతున్న వారికి నేడు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, బులియన్ మార్కెట్ కదలికల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే వేలల్లో పెరగడంతో కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ముందుగా ఫ్యూచర్స్ మార్కెట్ విషయానికి వస్తే.. మనీకంట్రోల్ వెల్లడించిన నవంబర్ 27 ఉదయం 9:05 గంటల లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. డిసెంబర్ 4 గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,24,107 వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఏకంగా రూ.1,835 పెరిగింది. అంటే ఒకే సెషన్‌లో పసిడి ధర గణనీయంగా పైకి కదిలింది. వెండి ధరల్లోనూ ఇదే తరహా పెరుగుదల కనిపిస్తోంది. MCXలో డిసెంబర్ 4 సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,51,500 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలోపై రూ.5,657 పెరిగింది. బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో పెరుగుదల మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. దీంతో ఫ్యూచర్స్ మార్కెట్‌లో రెండు విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి.

ఫ్యూచర్స్ మార్కెట్‌కే ఈ పెరుగుదల పరిమితం కాలేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. bullions.co.in నవంబర్ 27 ఉదయం 9:08 గంటలకు వెల్లడించిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.2,000 పెరిగి రూ.1,24,760కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ప్రస్తుతం రూ.1,18,690 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి: Gold Price Prediction: 6 నెలల్లోనే బంగారం ధరలకు రెక్కలు.. 10 గ్రాములు రూ.2.38లక్షలకు జంప్..?

ఇక వెండి కొనుగోలుదారులకు కూడా ధరల పెరుగుదలతో నిరాశ తప్పడం లేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర గత మార్కెట్ ముగింపు రేటుతో పోలిస్తే రూ.5,980 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,52,490కు చేరుకుంది. ఆభరణాల తయారీతో పాటు ఇతర అవసరాల కోసం వెండి కొనుగోలు చేయాలనుకునే వారిపై ఈ పెరుగుదల ప్రభావం చూపే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే, గత కొన్ని రోజులుగా ధరల తగ్గుదలతో ఊరట పొందిన కొనుగోలుదారులకు నేటి పెరుగుదల మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారు తాజా ధరలను గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇవి నిర్దిష్ట సమయానికి సంబంధించిన మార్కెట్ ధరలు మాత్రమే. మార్కెట్ కదలికలను బట్టి రోజులోనే ధరల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో స్థానిక జువెలరీ షాపులో తుది ధర, తరుగు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వివరాలను కూడా పరిశీలించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 9:38 am Digital Edition : Prabhanews
Gold Silver Prices Today: బంగారం కొనాలనుకునేవారికి అతి భారీ షాక్.. ఒక్కసారిగా వేలల్లో పెరిగిన ధరలు! | బిజినెస్

Last Updated:November 27, 2026 9:18 AM ISTGold Silver Prices Today: బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా దిగివచ్చిన ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.2,000, కిలో వెండిపై దాదాపు రూ.6,000 పెరిగింది. తాజా ధరలు ఇలా ఉన్నాయి.
News18గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా మళ్లీ షాక్ ఇచ్చాయి. ధరలు తగ్గుతున్నాయని కొనుగోళ్లకు సిద్ధమవుతున్న వారికి నేడు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, బులియన్ మార్కెట్ కదలికల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే వేలల్లో పెరగడంతో కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.ముందుగా ఫ్యూచర్స్ మార్కెట్ విషయానికి వస్తే.. మనీకంట్రోల్ వెల్లడించిన నవంబర్ 27 ఉదయం 9:05 గంటల లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. డిసెంబర్ 4 గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,24,107 వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఏకంగా రూ.1,835 పెరిగింది. అంటే ఒకే సెషన్‌లో పసిడి ధర గణనీయంగా పైకి కదిలింది. వెండి ధరల్లోనూ ఇదే తరహా పెరుగుదల కనిపిస్తోంది. MCXలో డిసెంబర్ 4 సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,51,500 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలోపై రూ.5,657 పెరిగింది. బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో పెరుగుదల మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. దీంతో ఫ్యూచర్స్ మార్కెట్‌లో రెండు విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి.ఫ్యూచర్స్ మార్కెట్‌కే ఈ పెరుగుదల పరిమితం కాలేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. bullions.co.in నవంబర్ 27 ఉదయం 9:08 గంటలకు వెల్లడించిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.2,000 పెరిగి రూ.1,24,760కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ప్రస్తుతం రూ.1,18,690 వద్ద కొనసాగుతోంది.ఇవి కూడా చదవండి: Gold Price Prediction: 6 నెలల్లోనే బంగారం ధరలకు రెక్కలు.. 10 గ్రాములు రూ.2.38లక్షలకు జంప్..?ఇక వెండి కొనుగోలుదారులకు కూడా ధరల పెరుగుదలతో నిరాశ తప్పడం లేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర గత మార్కెట్ ముగింపు రేటుతో పోలిస్తే రూ.5,980 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,52,490కు చేరుకుంది. ఆభరణాల తయారీతో పాటు ఇతర అవసరాల కోసం వెండి కొనుగోలు చేయాలనుకునే వారిపై ఈ పెరుగుదల ప్రభావం చూపే అవకాశం ఉంది.మొత్తంగా చూస్తే, గత కొన్ని రోజులుగా ధరల తగ్గుదలతో ఊరట పొందిన కొనుగోలుదారులకు నేటి పెరుగుదల మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారు తాజా ధరలను గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇవి నిర్దిష్ట సమయానికి సంబంధించిన మార్కెట్ ధరలు మాత్రమే. మార్కెట్ కదలికలను బట్టి రోజులోనే ధరల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో స్థానిక జువెలరీ షాపులో తుది ధర, తరుగు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వివరాలను కూడా పరిశీలించాలి.మరింత చదవండి

Source link