Tamil Nadu: కనీసం ఊపిరి కూడా పీల్చుకోకముందే.. ఆడపిల్ల అని సజీవ సమాధి చేసిన తల్లిదండ్రులు! |


Last Updated:

Tamil Nadu: ఆధునిక యుగంలోనూ ఆడపిల్లల పట్ల వివక్ష తగ్గడం లేదనడానికి తమిళనాడులో జరిగిన ఓ అమానుష ఘటనే నిదర్శనంగా నిలిచింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రెండోసారి కూడా ఆడబిడ్డే జన్మించిందన్న కోపంతో, కనీసం కళ్లు కూడా తెరవని పసికందును కన్నతల్లే కుటుంబ సభ్యులతో కలిసి సజీవంగా భూమిలో పూడ్చిపెట్టింది. రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపంలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రామేశ్వరం సమీపంలోని సంబై ప్రాంతానికి చెందిన నాగపాండి, యోగనందిని దంపతులకు ఇప్పటికే ఒక కుమార్తె ఉంది. ఇటీవల యోగనందిని మరోసారి గర్భం దాల్చింది. బుధవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నాగపాండి సోదరి మునీశ్వరి ఇంట్లోనే కుటుంబ సభ్యులు యోగనందినికి ప్రసవం చేశారు. ఆ ప్రసవంలో యోగనందినికి రెండోసారి కూడా ఆడబిడ్డే జన్మించింది.

మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న ఆగ్రహంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు కర్కశంగా ప్రవర్తించారు. అప్పుడే భూమిపైకి వచ్చిన ఆ ముక్కుపచ్చలారని పసికందును ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి సజీవంగా పాతిపెట్టారు. అయితే, ఇంట్లో అశాస్త్రీయంగా ప్రసవం జరగడంతో యోగనందిని తీవ్ర అస్వస్థతకు గురైంది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను రామేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆస్పత్రిలో యోగనందినిని పరీక్షించిన వైద్యులు ఆమెకు ఇటీవలే ప్రసవం జరిగినట్లు గుర్తించారు. బిడ్డ ఎక్కడ అని వైద్యులు ఆరా తీయగా, ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన వైద్యులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. రెండోసారి ఆడపిల్ల పుట్టడంతో ఇంటి వద్దే భూమిలో పాతిపెట్టినట్లు యోగనందిని అంగీకరించింది.

వెంటనే ఆస్పత్రి వైద్యులు రామేశ్వరం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఇంటి వద్దకు వెళ్లి, పూడ్చిపెట్టిన పసికందు మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తల్లి యోగనందిని, తండ్రి నాగపాండి, తాత కృష్ణన్, మేనత్త మునీశ్వరిలను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కన్నబిడ్డను అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన తల్లిదండ్రులే ఇలా కాలయముళ్లుగా మారడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 6:10 am Digital Edition : Prabhanews
Tamil Nadu: కనీసం ఊపిరి కూడా పీల్చుకోకముందే.. ఆడపిల్ల అని సజీవ సమాధి చేసిన తల్లిదండ్రులు! |

Last Updated:Nov 21, 2026 5:34 AM ISTTamil Nadu: ఆధునిక యుగంలోనూ ఆడపిల్లల పట్ల వివక్ష తగ్గడం లేదనడానికి తమిళనాడులో జరిగిన ఓ అమానుష ఘటనే నిదర్శనంగా నిలిచింది.ప్రతీకాత్మక చిత్రంరెండోసారి కూడా ఆడబిడ్డే జన్మించిందన్న కోపంతో, కనీసం కళ్లు కూడా తెరవని పసికందును కన్నతల్లే కుటుంబ సభ్యులతో కలిసి సజీవంగా భూమిలో పూడ్చిపెట్టింది. రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపంలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రామేశ్వరం సమీపంలోని సంబై ప్రాంతానికి చెందిన నాగపాండి, యోగనందిని దంపతులకు ఇప్పటికే ఒక కుమార్తె ఉంది. ఇటీవల యోగనందిని మరోసారి గర్భం దాల్చింది. బుధవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నాగపాండి సోదరి మునీశ్వరి ఇంట్లోనే కుటుంబ సభ్యులు యోగనందినికి ప్రసవం చేశారు. ఆ ప్రసవంలో యోగనందినికి రెండోసారి కూడా ఆడబిడ్డే జన్మించింది.మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న ఆగ్రహంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు కర్కశంగా ప్రవర్తించారు. అప్పుడే భూమిపైకి వచ్చిన ఆ ముక్కుపచ్చలారని పసికందును ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి సజీవంగా పాతిపెట్టారు. అయితే, ఇంట్లో అశాస్త్రీయంగా ప్రసవం జరగడంతో యోగనందిని తీవ్ర అస్వస్థతకు గురైంది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను రామేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.ఆస్పత్రిలో యోగనందినిని పరీక్షించిన వైద్యులు ఆమెకు ఇటీవలే ప్రసవం జరిగినట్లు గుర్తించారు. బిడ్డ ఎక్కడ అని వైద్యులు ఆరా తీయగా, ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన వైద్యులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. రెండోసారి ఆడపిల్ల పుట్టడంతో ఇంటి వద్దే భూమిలో పాతిపెట్టినట్లు యోగనందిని అంగీకరించింది.వెంటనే ఆస్పత్రి వైద్యులు రామేశ్వరం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఇంటి వద్దకు వెళ్లి, పూడ్చిపెట్టిన పసికందు మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తల్లి యోగనందిని, తండ్రి నాగపాండి, తాత కృష్ణన్, మేనత్త మునీశ్వరిలను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కన్నబిడ్డను అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన తల్లిదండ్రులే ఇలా కాలయముళ్లుగా మారడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.మరింత చదవండి

Source link