తిరుపతి – విశాఖపట్నం మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లు ప్రకటించింది రైల్వే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి – విశాఖపట్నం మధ్య మరో రెండు టీవోడీ (ట్రైన్ ఆన్ డిమాండ్) ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రకటించింది. 07423 నంబర్ తిరుపతి – విశాఖపట్నం టీవోడీ ప్రత్యేక రైలు నవంబర్ 21, 2026 (శనివారం) రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. నవంబర్ 22 (ఆదివారం) మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

