ప్రభన్యూస్

విదేశాల్లో పుట్టిన గడ్డనే అవమానిస్తున్నారు.. అమెరికాలో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ నితిన్ నిప్పులు! |


Last Updated:

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో భారత్ ‘ఆర్థిక విపత్తు’ అంచున ఉందంటూ లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం మండిపడ్డారు. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

News18
News18

భారత్ ‘ఆర్థిక విపత్తు’పై కూర్చుందంటూ అమెరికా పర్యటనలో లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, విదేశీ గడ్డపై నిలబడి సొంత దేశాన్ని అవమానించడం తగదని మండిపడ్డారు. 140 కోట్ల మంది భారతీయులు దేశ ప్రగతి కోసం కలిసికట్టుగా శ్రమిస్తుంటే, రాహుల్ భారత ఆర్థిక వ్యవస్థను విపత్తుగా అభివర్ణించడం విచారకరమన్నారు. ఇదే గడ్డపై పుట్టి, ఇక్కడే జీవనోపాధి పొందుతూ విదేశాలకు వెళ్లి మాతృభూమిని కించపరచడం కొందరికి అలవాటైందని విమర్శించారు.

భారత్ సాధిస్తున్న అభివృద్ధి, ప్రగతిని చూసి రాహుల్ అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ ఆర్థిక విధానాలను తప్పుబట్టిన నబీన్, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా పేదలకు అందేలా ప్రధాని నరేంద్ర మోదీ విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. రాహుల్ అమెరికా వ్యాఖ్యలు ప్రస్తుతం దేశీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దళారీలకు చెక్.. పీవీ, ప్రణబ్‌లకు కాంగ్రెస్ అవమానం: నబీన్

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను నబీన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ నుంచి రూపాయి పంపితే పేదలకు 15 పైసలు మాత్రమే చేరేవని రాజీవ్ స్వయంగా చెప్పారని, కానీ ప్రధాని మోదీ ఆ రూపాయి మొత్తం పేదలకు అందేలా సంకల్పించారని తెలిపారు. జన్ ధన్ యోజన ద్వారా పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిపించినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎగతాళి చేశారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు దళారీలుగా వ్యవహరించే అవకాశం లేకుండా, ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా పేదల ఖాతాల్లోకే నిధులు జమ కావడమే అతిపెద్ద మార్పు అని నబీన్ పేర్కొన్నారు.

సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, దేశం కంటే ఒకే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని బీజేపీ అధ్యక్షుడు ఆరోపించారు. సొంత పార్టీ పట్ల నిజమైన శ్రద్ధ ఉంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంటి సీనియర్ నేతలను అవమానించేది కాదని ఆయన విమర్శించారు. అంతకుముందు మంగళవారం (నవంబర్ 17) న్యూయార్క్ చేరుకున్న రాహుల్ గాంధీ, కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖిలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ వంటి కార్యక్రమాలు తగినన్ని ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమయ్యాయని రాహుల్ ఆరోపించారు. భారత్ భారీ నిరుద్యోగ సమస్యతో పాటు విద్యా వ్యవస్థలో తీవ్ర లోపాలను ఎదుర్కొంటోందని, దేశం ఆర్థిక విపత్తుపై కూర్చుందన్నదే వాస్తవమని వ్యాఖ్యానించారు. దీనిని మీడియా పట్టించుకోకపోవచ్చని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయం బలహీనపడ్డాయని అన్నారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సమర్థించారు. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంపై కంటే, రాహుల్ ఆ విషయాన్ని ప్రపంచం ముందు చెప్పడంపైనే కేంద్రం ఆందోళన చెందుతోందని కౌంటర్ ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 November 2026, 8:37 pm Digital Edition : Prabhanews
విదేశాల్లో పుట్టిన గడ్డనే అవమానిస్తున్నారు.. అమెరికాలో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ నితిన్ నిప్పులు! |

Last Updated:Nov 22, 2026 8:20 PM ISTఅమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో భారత్ ‘ఆర్థిక విపత్తు’ అంచున ఉందంటూ లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం మండిపడ్డారు. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.News18భారత్ ‘ఆర్థిక విపత్తు’పై కూర్చుందంటూ అమెరికా పర్యటనలో లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, విదేశీ గడ్డపై నిలబడి సొంత దేశాన్ని అవమానించడం తగదని మండిపడ్డారు. 140 కోట్ల మంది భారతీయులు దేశ ప్రగతి కోసం కలిసికట్టుగా శ్రమిస్తుంటే, రాహుల్ భారత ఆర్థిక వ్యవస్థను విపత్తుగా అభివర్ణించడం విచారకరమన్నారు. ఇదే గడ్డపై పుట్టి, ఇక్కడే జీవనోపాధి పొందుతూ విదేశాలకు వెళ్లి మాతృభూమిని కించపరచడం కొందరికి అలవాటైందని విమర్శించారు.భారత్ సాధిస్తున్న అభివృద్ధి, ప్రగతిని చూసి రాహుల్ అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ ఆర్థిక విధానాలను తప్పుబట్టిన నబీన్, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా పేదలకు అందేలా ప్రధాని నరేంద్ర మోదీ విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. రాహుల్ అమెరికా వ్యాఖ్యలు ప్రస్తుతం దేశీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.దళారీలకు చెక్.. పీవీ, ప్రణబ్‌లకు కాంగ్రెస్ అవమానం: నబీన్మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను నబీన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ నుంచి రూపాయి పంపితే పేదలకు 15 పైసలు మాత్రమే చేరేవని రాజీవ్ స్వయంగా చెప్పారని, కానీ ప్రధాని మోదీ ఆ రూపాయి మొత్తం పేదలకు అందేలా సంకల్పించారని తెలిపారు. జన్ ధన్ యోజన ద్వారా పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిపించినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎగతాళి చేశారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు దళారీలుగా వ్యవహరించే అవకాశం లేకుండా, ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా పేదల ఖాతాల్లోకే నిధులు జమ కావడమే అతిపెద్ద మార్పు అని నబీన్ పేర్కొన్నారు.సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, దేశం కంటే ఒకే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని బీజేపీ అధ్యక్షుడు ఆరోపించారు. సొంత పార్టీ పట్ల నిజమైన శ్రద్ధ ఉంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంటి సీనియర్ నేతలను అవమానించేది కాదని ఆయన విమర్శించారు. అంతకుముందు మంగళవారం (నవంబర్ 17) న్యూయార్క్ చేరుకున్న రాహుల్ గాంధీ, కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖిలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావంపై అనుమానాలు వ్యక్తం చేశారు.‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ వంటి కార్యక్రమాలు తగినన్ని ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమయ్యాయని రాహుల్ ఆరోపించారు. భారత్ భారీ నిరుద్యోగ సమస్యతో పాటు విద్యా వ్యవస్థలో తీవ్ర లోపాలను ఎదుర్కొంటోందని, దేశం ఆర్థిక విపత్తుపై కూర్చుందన్నదే వాస్తవమని వ్యాఖ్యానించారు. దీనిని మీడియా పట్టించుకోకపోవచ్చని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయం బలహీనపడ్డాయని అన్నారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సమర్థించారు. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంపై కంటే, రాహుల్ ఆ విషయాన్ని ప్రపంచం ముందు చెప్పడంపైనే కేంద్రం ఆందోళన చెందుతోందని కౌంటర్ ఇచ్చారు.మరింత చదవండి

Source link