Last Updated:
Bhogi Trailer: మొత్తానికి సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్, మాస్ ఎలివేషన్ల కలయికతో వచ్చిన ‘భోగి’ ట్రైలర్.. నవంబర్ 27న బాక్సాఫీస్ దగ్గర గంగా గాడి ఊచకోత ఏ రేంజ్లో ఉండబోతోందో శాంపిల్ చూపించేసింది!
Bhogi Trailer: చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘భోగి’ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో 3 నిమిషాల 6 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు క్లాస్ సినిమాలతో మెప్పించిన శర్వానంద్.. ఇందులో పూర్తిగా రా అండ్ రస్టిక్ ఊరమాస్ అవతార్‌లో కనిపించి గూస్బంప్స్ తెప్పిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ విశేషాలు ఏంటో చూద్దాం!
1960ల నాటి సరిహద్దు గ్రామం.. సిస్టర్ సెంటిమెంట్‌తో పాటు రక్తపాతం! 1960ల నాటి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ ట్రైలర్ సాగింది. చీకట్లో జీపు లైట్ల వెలుతురులో “ఏదో చూసినవంట.. ఏదో ఆపినవంట.. చీకట్ల తోటల చూసింది చీకట్లనే కలిసిపోవాలె” అనే పవర్ఫుల్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆరంభం నుంచే క్యూరియాసిటీని పెంచేసింది.
గంగా పాత్రలో శర్వా విశ్వరూపం: ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా, ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉండే ‘గంగా’ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయారు. ఒకవైపు కుటుంబ అనుబంధాలు, మరోవైపు “ఈ ఇంట్లో మీ అన్నకు గండం గోచరిస్తాందే తల్లి” అనే హెచ్చరికతో కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది.
పవర్ఫుల్ మాస్ డైలాగ్స్: “ఈ రాత్రికి కోత నాది.. లెక్క మీది” అంటూ మంటల మధ్య నుంచి శర్వా వచ్చే ఎలివేషన్ సీన్లు, పదునైన కొడవళ్లతో సాగే యాక్షన్ ఎపిసోడ్స్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి. అనుపమ, డింపుల్ హయాతి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్! ఈ చిత్రంలో కథానాయికలు అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కూడా తమ నటనతో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు:
డీ-గ్లామర్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన అనుపమ పరమేశ్వరన్.. “వాడు బొగ్గుల పుట్టిండు.. గుగ్గిలో పెరిగిండు.. వాడికి కొలిమి అంటించుడు తెలుసు, కొరివి పెట్టుడూ తెలుసు” అంటూ చెప్పిన డైలాగ్ శర్వా పాత్రలోని భీకర రూపాన్ని ఆవిష్కరించింది. ఇక డింపుల్ హయాతి పలికిన మాస్ డైలాగ్ కూడా కుర్రకారుతో విజిల్స్ వేయించేలా ఉంది.
భీమ్స్ బీజీఎం.. ఎమోషనల్ క్లైమాక్స్ టచ్! డైరెక్టర్ సంపత్ నంది తన కెరీర్లోనే అత్యంత ఇంటెన్స్ కథను ఎంచుకున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఎ. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ 1960ల నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించగా, భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రాణం పోసింది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో “చిన్న పిల్లలు ఏడ్చి మర్చిపోతారు.. పెద్దోళ్లు మర్చిపోలేక ఏడుస్తారు.. ఎన్ని జన్మలు ఏడిస్తే మా ఏడుపు చల్లారుతుంది” అంటూ శర్వా పలికిన ఎమోషనల్ డైలాగ్ గుండెను బరువెక్కిస్తోంది.

