Last Updated:
Gold Price Today: బంగారం, వెండి కొనాలనుకునే వారికి బుధవారం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. మంగళవారం ధరలు పెరగ్గా.. బుధవారం భారీ పతనం జరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ఎంత పెరిగిందో తెలుసా?
Gold Price Today: బంగారం, వెండి కొనాలని భావిస్తున్న వారికి బుధవారం ఉదయం ఊహించని గుడ్ న్యూస్. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ రెండు విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా పడ్డాయి. గత ట్రేడింగ్ సెషన్తో పోలిస్తే బంగారం, వెండి రేట్లు భారీగా పతనం అయ్యాయి. దీంతో కొనుగోలుదారులు ఇది గుడ్ న్యూస్. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి.
బుధవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు భారీగా తగ్గాయి. డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,31,741 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.2,482 తగ్గింది. అంటే మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగారం ధరలో ఏకంగా 1.8 శాతం పతనం కనిపించింది. వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,64,790 వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపుతో పోలిస్తే కిలో వెండిపై రూ.4,912 తగ్గుదల నమోదైంది. దీంతో ఫ్యూచర్స్ మార్కెట్లో రెండు లోహాల ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఫ్యూచర్స్ మార్కెట్లోనే కాకుండా హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పడ్డాయి. ఉదయం 9:07 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.2,540 తగ్గి .1,32,300కు చేరింది. అదే సమయంలో ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,21,575 వద్ద కొనసాగుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పాలి.
ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో కిలో ధర గత మార్కెట్ ముగింపు రేటుతో పోలిస్తే రూ.4,940 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,65,400 వద్ద కొనసాగుతోంది. అయితే బంగారం, వెండి ధరలు రోజంతా ఒకేలా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అమ్మకాలు వంటి అంశాల ఆధారంగా ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. అలాగే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు స్థానిక దుకాణాల ధరలు, తరుగు, తయారీ ఛార్జీలు, జీఎస్టీ అదనంగా వర్తించవచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను నగల దుకాణంలో మరోసారి తెలుసుకోవడం మంచిది.

