2026 జూన్ 30 నాటి గణాంకాల ప్రకారం, ఈ ఫండ్ తన బెంచ్‌మార్క్ అయిన నిఫ్టీ 500 ఇండెక్స్‌తో పోలిస్తే ఒక సంవత్సరం, మూడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల కాలంలోనే కాకుండా ప్రారంభం నుంచి కూడా మెరుగైన రాబడులు ఇచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెలిపింది. ఫండ్ ప్రారంభం నుంచి చూస్తే, దీని కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 13.14 శాతంగా ఉండగా, నిఫ్టీ 500 ఇండెక్స్‌కు అది 5.74 శాతంగా నమోదైంది. ఈ సందర్భంగా టెంపుల్టన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇండియా ఈక్విటీస్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ కిరణ్ సెబాస్టియన్ మాట్లాడుతూ, తయారీ రంగం వృద్ధి, వినియోగదారుల ఆశయాలు పెరగడం, డిజిటల్ వినియోగం పెరగడం వంటి దీర్ఘకాలిక అవకాశాల నుంచి లాభపడే వ్యాపారాలను గుర్తించడంపైనే ఈ ఫండ్ ఇప్పటికీ దృష్టి పెట్టిందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

