ప్రభన్యూస్

Sudigali Sudheer: సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ మూవీ…! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గోట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. జైష్ణవ్ ప్రొడక్షన్స్, మహతేజ క్రియేషన్స్ బ్యానర్లపై మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి రవిందర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు.

News18
News18

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గోట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. జైష్ణవ్ ప్రొడక్షన్స్, మహతేజ క్రియేషన్స్ బ్యానర్లపై మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి రవిందర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. వేదవ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్‌గా నటించగా, నితిన్ ప్రసన్న కీలక పాత్ర పోషించారు. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తూ బ్లాక్‌బస్టర్ దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శనివారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత, హీరోయిన్, దర్శకుడు సహా పలువురు చిత్ర విశేషాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘గోట్’ సినిమా ప్రయాణం మూడేళ్లుగా కొనసాగిందని తెలిపారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని, అయినప్పటికీ పట్టు వదలకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. దర్శకుడు వేదవ్యాస్ ఈ ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాత కథకు మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. మంచి సందేశంతో పాటు వినోదాన్ని అందించేలా సినిమాను రూపొందించినట్లు వివరించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారని, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తినిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం తాను పడిన కష్టాలు, ఎదుర్కొన్న పరిస్థితులను ఒక చిత్రంగా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో హీరోయిన్ దివ్య భారతి ఎంతో సహకరించారని గుర్తుచేసుకున్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.

హీరోయిన్ దివ్య భారతి మాట్లాడుతూ.. థియేటర్లలో ప్రేక్షకులు ‘గోట్’ సినిమాను ఎంతో ఆస్వాదిస్తున్నారని తెలిపారు. తనపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చూసి సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం పడిన కష్టం వృథా కాలేదని ప్రేక్షకుల స్పందన చూస్తుంటే అర్థమవుతోందని చెప్పారు. థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ తమకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టు వదలకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాత చంద్రశేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమకు అండగా నిలిచిన దర్శకుడు వేదవ్యాస్‌కు ధన్యవాదాలు చెప్పారు.

దర్శకుడు వేదవ్యాస్ మాట్లాడుతూ.. ‘గోట్’ సినిమాకు థియేటర్లలో అద్భుతమైన స్పందన లభిస్తోందని అన్నారు. ప్రేక్షకుల రియాక్షన్స్‌ను ప్రత్యక్షంగా చూసి తాను ఎంతో ఆనందించానని తెలిపారు. ఈ సినిమాకు సహకరించిన మీడియా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. చిత్ర విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్ దక్కుతుందని పేర్కొన్నారు. బెట్టింగ్ అనేది సరదా కోసం చేసే పని మాత్రమేనని, అయితే అది హద్దులు దాటకూడదనే విషయాన్ని సినిమాలో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసినట్లు వివరించారు. ఈ సినిమా చూసిన తర్వాత కనీసం ఒక్కరైనా బెట్టింగ్‌కు దూరంగా ఉంటే తమ ప్రయత్నం సఫలమైనట్లేనని అభిప్రాయపడ్డారు.

నటుడు నితిన్ ప్రసన్న మాట్లాడుతూ.. ‘గోట్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, థియేటర్లలో ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారని చెప్పారు. దర్శకుడు వేదవ్యాస్ కథను అద్భుతంగా వివరించారని, మంచి సందేశాన్ని అందించేలా సినిమాను రూపొందించారని ప్రశంసించారు. ఇక మాస్టర్ మురారి మాట్లాడుతూ.. తన పాత్రకు మంచి స్పందన వస్తుందని దర్శక నిర్మాతలు ముందే చెప్పారని, వారు చెప్పినట్లుగానే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాగే ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 November 2026, 9:12 pm Digital Edition : Prabhanews
Sudigali Sudheer: సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ మూవీ…! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 14, 2026 9:06 PM ISTసుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గోట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. జైష్ణవ్ ప్రొడక్షన్స్, మహతేజ క్రియేషన్స్ బ్యానర్లపై మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి రవిందర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. News18సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గోట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. జైష్ణవ్ ప్రొడక్షన్స్, మహతేజ క్రియేషన్స్ బ్యానర్లపై మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి రవిందర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. వేదవ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్‌గా నటించగా, నితిన్ ప్రసన్న కీలక పాత్ర పోషించారు. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తూ బ్లాక్‌బస్టర్ దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శనివారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత, హీరోయిన్, దర్శకుడు సహా పలువురు చిత్ర విశేషాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘గోట్’ సినిమా ప్రయాణం మూడేళ్లుగా కొనసాగిందని తెలిపారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని, అయినప్పటికీ పట్టు వదలకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. దర్శకుడు వేదవ్యాస్ ఈ ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాత కథకు మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. మంచి సందేశంతో పాటు వినోదాన్ని అందించేలా సినిమాను రూపొందించినట్లు వివరించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారని, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తినిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం తాను పడిన కష్టాలు, ఎదుర్కొన్న పరిస్థితులను ఒక చిత్రంగా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో హీరోయిన్ దివ్య భారతి ఎంతో సహకరించారని గుర్తుచేసుకున్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.హీరోయిన్ దివ్య భారతి మాట్లాడుతూ.. థియేటర్లలో ప్రేక్షకులు ‘గోట్’ సినిమాను ఎంతో ఆస్వాదిస్తున్నారని తెలిపారు. తనపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చూసి సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం పడిన కష్టం వృథా కాలేదని ప్రేక్షకుల స్పందన చూస్తుంటే అర్థమవుతోందని చెప్పారు. థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ తమకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టు వదలకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాత చంద్రశేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమకు అండగా నిలిచిన దర్శకుడు వేదవ్యాస్‌కు ధన్యవాదాలు చెప్పారు.దర్శకుడు వేదవ్యాస్ మాట్లాడుతూ.. ‘గోట్’ సినిమాకు థియేటర్లలో అద్భుతమైన స్పందన లభిస్తోందని అన్నారు. ప్రేక్షకుల రియాక్షన్స్‌ను ప్రత్యక్షంగా చూసి తాను ఎంతో ఆనందించానని తెలిపారు. ఈ సినిమాకు సహకరించిన మీడియా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. చిత్ర విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్ దక్కుతుందని పేర్కొన్నారు. బెట్టింగ్ అనేది సరదా కోసం చేసే పని మాత్రమేనని, అయితే అది హద్దులు దాటకూడదనే విషయాన్ని సినిమాలో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసినట్లు వివరించారు. ఈ సినిమా చూసిన తర్వాత కనీసం ఒక్కరైనా బెట్టింగ్‌కు దూరంగా ఉంటే తమ ప్రయత్నం సఫలమైనట్లేనని అభిప్రాయపడ్డారు.నటుడు నితిన్ ప్రసన్న మాట్లాడుతూ.. ‘గోట్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, థియేటర్లలో ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారని చెప్పారు. దర్శకుడు వేదవ్యాస్ కథను అద్భుతంగా వివరించారని, మంచి సందేశాన్ని అందించేలా సినిమాను రూపొందించారని ప్రశంసించారు. ఇక మాస్టర్ మురారి మాట్లాడుతూ.. తన పాత్రకు మంచి స్పందన వస్తుందని దర్శక నిర్మాతలు ముందే చెప్పారని, వారు చెప్పినట్లుగానే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాగే ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.మరింత చదవండి

Source link