జనవరి 2026లో ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. ఉదాహరణకు, జనవరిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,000గా ఉండేది. ఇప్పుడు అది రూ.1,26,000కు తగ్గింది. అంటే దాదాపు 22.7 శాతం ధర పడిపోయింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా జనవరిలో రూ.1,78,000 ఉండగా, ఇప్పుడు రూ.1,37,000కు చేరింది. అంటే సుమారు 23 శాతం తగ్గింది. బంగారం ధరల్లో వచ్చిన ఈ భారీ మార్పు.. గతంలో ఎక్కువ ధర ఉన్నప్పుడు నగలను తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నవారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. లోన్-టు-వాల్యూ (ఎల్‌టీవీ) రేషియో అంటే.. తాకట్టు పెట్టిన బంగారం విలువతో పోలిస్తే తీసుకున్న లోన్ ఎంత శాతం ఉందో తెలిపే లెక్క. దీన్ని ఒక ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)

