ప్రభన్యూస్

Nvidia CEO: జెన్సన్ హువాంగ్‌కు ఎలాన్ మస్క్ మద్దతు.. పిటిషన్‌పై సంతకం చేస్తానంటూ ప్రకటన! |


Last Updated:

ఎన్విడియా సంస్థలో నాయకత్వ మార్పు వ్యవహారం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. సీఈఓ పదవి నుంచి జెన్సన్ హువాంగ్ తప్పుకున్న నేపథ్యంలో, ఆయనను తిరిగి బాధ్యతల్లోకి తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ డిమాండ్‌కు టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా మద్దతు తెలిపారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఎలాన్ మస్క్ (Image - x)
ఎలాన్ మస్క్ (Image – x)

ప్రపంచంలోనే అత్యంత విలువైన చిప్ తయారీ సంస్థల్లో ఒకటైన ఎన్విడియా (Nvidia)లో నాయకత్వ మార్పు చర్చనీయాంశంగా మారింది. సంస్థ సీఈఓ పదవికి జెన్సన్ హువాంగ్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో, ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టాలనే డిమాండ్ ఉద్యోగుల్లో వినిపిస్తోంది. ఈ ప్రయత్నానికి ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కూడా మద్దతు తెలిపారు. జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించాలని కోరుతూ జరుగుతున్న పిటిషన్‌పై తాను కూడా సంతకం చేస్తానని ఆయన ప్రకటించారు.

జెన్సన్ హువాంగ్‌కు మస్క్ మద్దతు

తన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో స్పందించిన ఎలాన్ మస్క్.. జెన్సన్‌ను తిరిగి తీసుకురావాలని కోరుతూ ఒక పిటిషన్ ప్రారంభమైందని, అందులో తానూ భాగస్వామి అవుతానని పేర్కొన్నారు. జెన్సన్ హువాంగ్ వైదొలిగిన తర్వాత ఎన్విడియా బోర్డు కొత్త సీఈఓ ఎంపికపై దృష్టి పెట్టిన సమయంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యక్తిగత సంబంధాలపై వెలువడిన ఆరోపణల నేపథ్యంలో గురువారం జెన్సన్ హువాంగ్ సంస్థ అధ్యక్ష, సీఈఓ పదవుల నుంచి తప్పుకున్నట్లు కథనంలో పేర్కొన్నారు. చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో సంబంధం సహా పలు వివాహేతర సంబంధాల గురించి వెల్లడైన అంశాలు ఈ పరిణామానికి కారణంగా నివేదిక పేర్కొంది. ఆలిస్ హువాంగ్‌కు చైనా నిఘా వర్గాలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు అమెరికా అధికారులు వ్యక్తం చేసినట్లు కూడా కథనంలో ఉంది.

జెన్సన్‌ను తిరిగి తీసుకురావాలని ఉద్యోగుల డిమాండ్

వైర్డ్ కథనం ప్రకారం, ఎన్విడియాలో చాలాకాలంగా పనిచేస్తున్న ఓ ఇంజినీర్ సంస్థ అంతర్గత వేదికపై సహచరులకు ఒక సందేశం పంపారు. నాయకత్వంపై నిర్ణయం తీసుకునే ముందు ఉద్యోగుల అభిప్రాయాలను బోర్డు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ పోస్టుకు 1,600కు పైగా స్పందనలు వచ్చాయి. పలువురు ఉద్యోగులు జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకొచ్చే మార్గాన్ని పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్విడియాలో సుమారు 42 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

అయితే కొత్త సీఈఓ ఎంపిక కోసం ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థను నియమించే ప్రక్రియలో ఉన్నామని బోర్డు వెల్లడించింది. ఇప్పటివరకు ఏ అభ్యర్థినీ అధికారికంగా సంప్రదించలేదని, వ్యక్తుల పేర్లపై వస్తున్న ఊహాగానాలు తొందరపాటేనని స్పష్టం చేసింది.

రేసులో రెనే హాస్ సహా పలువురు

ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, ఆర్మ్ హోల్డింగ్స్ సీఈఓ రెనే హాస్‌ను ఎన్విడియా బోర్డు సంప్రదించింది. 2022లో ఆర్మ్ బాధ్యతలు చేపట్టిన ఆయన, గతంలో ఏడేళ్లు ఎన్విడియాలో పనిచేసి కంప్యూటింగ్ ఉత్పత్తుల విభాగానికి వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా ఎదిగారు. 2013లో ఎన్విడియాను వీడిన ఆయన, 2023లో ఆర్మ్ నాస్‌డాక్‌లో నమోదయ్యే ప్రక్రియకు నాయకత్వం వహించారు. ఆర్మ్ సంస్థ ప్రాసెసర్ రూపకల్పన సాంకేతికతను అభివృద్ధి చేసి ఇతర కంపెనీలకు లైసెన్స్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు కంప్యూటర్ల రంగంలోనూ విస్తరిస్తోంది.

ప్రస్తుతం ఎన్విడియా ఆర్థిక విభాగ అధిపతి కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అంతర్గత అభ్యర్థిగా కుడా సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఇయాన్ బక్ పేరు వినిపిస్తోంది. బాహ్య అభ్యర్థులుగా ఏఎండీ సీఈఓ లిసా సు, మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా, మార్వెల్ సీఈఓ మాట్ మర్ఫీ, యాపిల్ హార్డ్‌వేర్ అధిపతి జానీ స్రౌజీ పేర్లు చర్చలో ఉన్నాయి. మాజీ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రస్తావించినట్లు కథనం తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 November 2026, 12:08 pm Digital Edition : Prabhanews
Nvidia CEO: జెన్సన్ హువాంగ్‌కు ఎలాన్ మస్క్ మద్దతు.. పిటిషన్‌పై సంతకం చేస్తానంటూ ప్రకటన! |

Last Updated:Nov 14, 2026 11:24 AM ISTఎన్విడియా సంస్థలో నాయకత్వ మార్పు వ్యవహారం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. సీఈఓ పదవి నుంచి జెన్సన్ హువాంగ్ తప్పుకున్న నేపథ్యంలో, ఆయనను తిరిగి బాధ్యతల్లోకి తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ డిమాండ్‌కు టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా మద్దతు తెలిపారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఎలాన్ మస్క్ (Image - x)ప్రపంచంలోనే అత్యంత విలువైన చిప్ తయారీ సంస్థల్లో ఒకటైన ఎన్విడియా (Nvidia)లో నాయకత్వ మార్పు చర్చనీయాంశంగా మారింది. సంస్థ సీఈఓ పదవికి జెన్సన్ హువాంగ్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో, ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టాలనే డిమాండ్ ఉద్యోగుల్లో వినిపిస్తోంది. ఈ ప్రయత్నానికి ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కూడా మద్దతు తెలిపారు. జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించాలని కోరుతూ జరుగుతున్న పిటిషన్‌పై తాను కూడా సంతకం చేస్తానని ఆయన ప్రకటించారు.జెన్సన్ హువాంగ్‌కు మస్క్ మద్దతుతన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో స్పందించిన ఎలాన్ మస్క్.. జెన్సన్‌ను తిరిగి తీసుకురావాలని కోరుతూ ఒక పిటిషన్ ప్రారంభమైందని, అందులో తానూ భాగస్వామి అవుతానని పేర్కొన్నారు. జెన్సన్ హువాంగ్ వైదొలిగిన తర్వాత ఎన్విడియా బోర్డు కొత్త సీఈఓ ఎంపికపై దృష్టి పెట్టిన సమయంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యక్తిగత సంబంధాలపై వెలువడిన ఆరోపణల నేపథ్యంలో గురువారం జెన్సన్ హువాంగ్ సంస్థ అధ్యక్ష, సీఈఓ పదవుల నుంచి తప్పుకున్నట్లు కథనంలో పేర్కొన్నారు. చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో సంబంధం సహా పలు వివాహేతర సంబంధాల గురించి వెల్లడైన అంశాలు ఈ పరిణామానికి కారణంగా నివేదిక పేర్కొంది. ఆలిస్ హువాంగ్‌కు చైనా నిఘా వర్గాలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు అమెరికా అధికారులు వ్యక్తం చేసినట్లు కూడా కథనంలో ఉంది.జెన్సన్‌ను తిరిగి తీసుకురావాలని ఉద్యోగుల డిమాండ్వైర్డ్ కథనం ప్రకారం, ఎన్విడియాలో చాలాకాలంగా పనిచేస్తున్న ఓ ఇంజినీర్ సంస్థ అంతర్గత వేదికపై సహచరులకు ఒక సందేశం పంపారు. నాయకత్వంపై నిర్ణయం తీసుకునే ముందు ఉద్యోగుల అభిప్రాయాలను బోర్డు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ పోస్టుకు 1,600కు పైగా స్పందనలు వచ్చాయి. పలువురు ఉద్యోగులు జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకొచ్చే మార్గాన్ని పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్విడియాలో సుమారు 42 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.అయితే కొత్త సీఈఓ ఎంపిక కోసం ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థను నియమించే ప్రక్రియలో ఉన్నామని బోర్డు వెల్లడించింది. ఇప్పటివరకు ఏ అభ్యర్థినీ అధికారికంగా సంప్రదించలేదని, వ్యక్తుల పేర్లపై వస్తున్న ఊహాగానాలు తొందరపాటేనని స్పష్టం చేసింది.రేసులో రెనే హాస్ సహా పలువురుఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, ఆర్మ్ హోల్డింగ్స్ సీఈఓ రెనే హాస్‌ను ఎన్విడియా బోర్డు సంప్రదించింది. 2022లో ఆర్మ్ బాధ్యతలు చేపట్టిన ఆయన, గతంలో ఏడేళ్లు ఎన్విడియాలో పనిచేసి కంప్యూటింగ్ ఉత్పత్తుల విభాగానికి వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా ఎదిగారు. 2013లో ఎన్విడియాను వీడిన ఆయన, 2023లో ఆర్మ్ నాస్‌డాక్‌లో నమోదయ్యే ప్రక్రియకు నాయకత్వం వహించారు. ఆర్మ్ సంస్థ ప్రాసెసర్ రూపకల్పన సాంకేతికతను అభివృద్ధి చేసి ఇతర కంపెనీలకు లైసెన్స్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు కంప్యూటర్ల రంగంలోనూ విస్తరిస్తోంది.ప్రస్తుతం ఎన్విడియా ఆర్థిక విభాగ అధిపతి కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అంతర్గత అభ్యర్థిగా కుడా సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఇయాన్ బక్ పేరు వినిపిస్తోంది. బాహ్య అభ్యర్థులుగా ఏఎండీ సీఈఓ లిసా సు, మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా, మార్వెల్ సీఈఓ మాట్ మర్ఫీ, యాపిల్ హార్డ్‌వేర్ అధిపతి జానీ స్రౌజీ పేర్లు చర్చలో ఉన్నాయి. మాజీ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రస్తావించినట్లు కథనం తెలిపింది.మరింత చదవండి

Source link