ప్రభన్యూస్

Dada First Single: దాదా ఆన్ ఫైర్.. బాలకృష్ణ పాడిన ఈ సాంగ్ చూడండి, మామూలు ధమాకా కాదురా అయ్యా | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నందమూరి బాలకృష్ణ మాస్ జాతర మరోసారి మొదలుకాబోతోందని తెలిసేలా తాజాగా దాదా సినిమా నుంచి హుషారెత్తించే సాంగ్ వదిలారు. ఈ పాట చూసి నందమూరి ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు.

News18
News18

నందమూరి బాలకృష్ణ మాస్ జాతర మరోసారి మొదలుకాబోతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించేందుకు బాలకృష్ణ సిద్ధమయ్యారు. ‘వీరసింహారెడ్డి’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దాదా’. ఈ సినిమా ప్రకటన రాగానే నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దానికి తగ్గట్లుగానే వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలకృష్ణ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే డైనమిక్ స్టార్ మంచు మనోజ్ ఒక పవర్‌ఫుల్ అండ్ కీలక పాత్రలో కనిపించడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడానికి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘దాదా ధమాకా’ పేరుతో విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.థమన్ ఈ పాటకు అదిరిపోయే ఊర మాస్ డ్యాన్స్ ట్యూన్ కంపోజ్ చేయగా… “బావలే బావలే.. ఇక్కడున్న వాళ్లంతా నాకు సొంత బావలే” అంటూ ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ అందించారు.

ఈ పాటకు ఉన్న అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే.. బాలకృష్ణ స్వయంగా గొంతు సవరించి ఈ పాటను పాడటం! గతంలో ‘పైసా వసూల్’ మూవీలో “మామా ఏక్ పెగ్ లా” అంటూ మాస్ సాంగ్ పాడి తనలోని గాయకుడిని పరిచయం చేసిన బాలయ్య.. అప్పట్లో ఆ పాటతో చార్ట్‌బస్టర్ సృష్టించారు. పలు ఈవెంట్లలోనూ పాటలు పాడి అభిమానులను అలరించిన ఆయన.. ఇప్పుడు సింగర్ శ్రీ పూర్ణిమతో కలిసి ఎంతో హుషారుగా ‘దాదా ధమాకా’ గీతాన్ని ఆలపించారు. తనదైన ఎనర్జిటిక్ వాయిస్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నారు.

ఇక విజువల్స్ పరంగానూ ఈ పాట వేరే లెవెల్ లో ఉండబోతోంది. బాలయ్యతో కలిసి బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులేశారు. భారీ సెట్స్, కలర్‌ ఫుల్ విజువల్స్‌తో ఈ సాంగ్ ను ఎంతో రిచ్ గా షూట్ చేశారు. వరస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య, గోపీచంద్ మలినేనితో దాదా రూపంలో మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 November 2026, 8:36 am Digital Edition : Prabhanews
Dada First Single: దాదా ఆన్ ఫైర్.. బాలకృష్ణ పాడిన ఈ సాంగ్ చూడండి, మామూలు ధమాకా కాదురా అయ్యా | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 14, 2026 7:51 AM ISTనందమూరి బాలకృష్ణ మాస్ జాతర మరోసారి మొదలుకాబోతోందని తెలిసేలా తాజాగా దాదా సినిమా నుంచి హుషారెత్తించే సాంగ్ వదిలారు. ఈ పాట చూసి నందమూరి ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. News18నందమూరి బాలకృష్ణ మాస్ జాతర మరోసారి మొదలుకాబోతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించేందుకు బాలకృష్ణ సిద్ధమయ్యారు. 'వీరసింహారెడ్డి' లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దాదా’. ఈ సినిమా ప్రకటన రాగానే నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దానికి తగ్గట్లుగానే వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలకృష్ణ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే డైనమిక్ స్టార్ మంచు మనోజ్ ఒక పవర్‌ఫుల్ అండ్ కీలక పాత్రలో కనిపించడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడానికి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘దాదా ధమాకా’ పేరుతో విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.థమన్ ఈ పాటకు అదిరిపోయే ఊర మాస్ డ్యాన్స్ ట్యూన్ కంపోజ్ చేయగా... "బావలే బావలే.. ఇక్కడున్న వాళ్లంతా నాకు సొంత బావలే" అంటూ ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ అందించారు.ఈ పాటకు ఉన్న అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే.. బాలకృష్ణ స్వయంగా గొంతు సవరించి ఈ పాటను పాడటం! గతంలో ‘పైసా వసూల్’ మూవీలో "మామా ఏక్ పెగ్ లా" అంటూ మాస్ సాంగ్ పాడి తనలోని గాయకుడిని పరిచయం చేసిన బాలయ్య.. అప్పట్లో ఆ పాటతో చార్ట్‌బస్టర్ సృష్టించారు. పలు ఈవెంట్లలోనూ పాటలు పాడి అభిమానులను అలరించిన ఆయన.. ఇప్పుడు సింగర్ శ్రీ పూర్ణిమతో కలిసి ఎంతో హుషారుగా ‘దాదా ధమాకా’ గీతాన్ని ఆలపించారు. తనదైన ఎనర్జిటిక్ వాయిస్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నారు.ఇక విజువల్స్ పరంగానూ ఈ పాట వేరే లెవెల్ లో ఉండబోతోంది. బాలయ్యతో కలిసి బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులేశారు. భారీ సెట్స్, కలర్‌ ఫుల్ విజువల్స్‌తో ఈ సాంగ్ ను ఎంతో రిచ్ గా షూట్ చేశారు. వరస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య, గోపీచంద్ మలినేనితో దాదా రూపంలో మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అనిపిస్తోంది.మరింత చదవండి

Source link