ప్రభన్యూస్

Itlu Arjuna Movie Review: ‘ఇట్లు అర్జున’ మూవీ రివ్యూ… ఈ క్రేజీ థ్రిల్లర్ లవ్‌స్టోరీ ప్రేక్షకులను మెప్పించిందా? | తెలుగు సినిమా వార్తలు


కథేంటంటే?

అర్జున్‌ (అనీష్‌ రెడ్డి) పుట్టుకతోనే మాటలు రాని యువకుడు. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి దొంగతనాలు చేస్తూ పెరుగుతాడు. ఓ దొంగతనం సమయంలో పోలీసులకు చిక్కడంతో జైలు జీవితం అనుభవించాల్సి వస్తుంది. తండ్రిని కోల్పోయిన అర్జున్‌.. జైలు నుంచి బయటకు వచ్చాక ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. మరోవైపు తన చిన్ననాటి స్నేహితురాలు కీర్తి (అనస్వర రాజన్‌)ను ప్రేమిస్తుంటాడు. అయితే మాటలు రాకపోవడంతో తన ప్రేమను ఆమెకు ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతుంటాడు.

ఇదిలా ఉంటే.. పాతబస్తీకి చెందిన పెద్దన్న (ముఖేష్‌ రిషి) తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం రూ.1000 కోట్ల హవాలా డబ్బును సమకూర్చే ప్రయత్నం చేస్తాడు. ఈ వ్యవహారంలో ఓ పెన్‌డ్రైవ్‌, పాస్‌వర్డ్‌ అర్జున్‌కు ముడిపడతాయి. దీంతో అతడి జీవితం ఒక్కసారిగా ప్రమాదంలో పడుతుంది. అసలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముంది? దాని కోసం అర్జున్‌ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? కీర్తి తన ప్రేమను అంగీకరించిందా? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే?

మూగ యువకుడి ప్రేమకథకు క్రైమ్‌ థ్రిల్లర్‌ అంశాలను జోడించి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోకు మాటలు రాకపోవడం, తన భావాలను హావభావాలతో వ్యక్తపరచడం అనే ప్రధాన పాయింట్‌ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా అర్జున్‌, కీర్తి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. మాటలు లేకుండానే ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో పడే తపన కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది.

ఫస్టాఫ్‌లో ఎక్కువగా ప్రేమకథపైనే దృష్టి పెట్టారు. మరోవైపు వెయ్యి కోట్ల హవాలా వ్యవహారాన్ని కూడా సమాంతరంగా నడిపిస్తూ కథపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. కామెడీ ఆశించిన స్థాయిలో పండకపోవడం కూడా కొంత నిరాశ కలిగిస్తుంది.

సెకండాఫ్‌లో కథ పూర్తిగా క్రైమ్‌ థ్రిల్లర్‌ వైపు మళ్లుతుంది. పెన్‌డ్రైవ్‌, హవాలా డబ్బు చుట్టూ జరిగే పరిణామాలు, మాఫియా గ్యాంగ్‌తో అర్జున్‌ తలపడే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో జాతర నేపథ్యంలో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని ట్విస్టులు, సన్నివేశాల్లో లాజిక్‌ లోపించడం మైనస్‌గా మారింది. స్క్రీన్‌ప్లేపై పెట్టిన శ్రద్ధ కథలోని లాజిక్‌పైనా పెట్టి ఉంటే సినిమా మరింత బాగుండేది.

ప్లస్ పాయింట్స్:

– కొత్త తరహా ప్రేమకథ

– అనీష్‌ రెడ్డి నటన, హావభావాలు

– అనస్వర రాజన్‌ సహజమైన నటన

– యాక్షన్‌ సన్నివేశాలు

– జాతర నేపథ్యంలో వచ్చే ప్రీ క్లైమాక్స్‌ ఎపిసోడ్‌

– సినిమాటోగ్రఫీ, విజువల్స్‌

మైనస్ పాయింట్స్:

– అక్కడక్కడా నెమ్మదించే కథనం

– కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవడం

– కొన్ని లాజిక్‌లేని సన్నివేశాలు

ఎవరెలా చేశారంటే?

హీరోగా అనీష్‌ రెడ్డికి ఇది తొలి సినిమా అయినప్పటికీ అర్జున్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా మాటలు లేకుండా హావభావాలతో భావాలను పలికించిన తీరు బాగుంది. డాన్సులు, యాక్షన్‌ సన్నివేశాల్లోనూ తన ప్రతిభ చూపించాడు. హీరోయిన్‌ అనస్వర రాజన్‌ అందంగా కనిపించడంతో పాటు సహజమైన నటనతో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్‌ కామెడీ మాత్రం ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. బ్రహ్మాజీ, రఘుబాబు, గెటప్‌ శ్రీను తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ముఖేష్‌ రిషి విలన్‌గా కనిపించినా ఆయన పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది.

సాంకేతికంగా ఎలా ఉందంటే?

తమన్‌ అందించిన పాటలు ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం యాక్షన్‌ సన్నివేశాలకు బలాన్ని ఇచ్చింది. అయితే కొన్ని చోట్ల ఇతర సినిమాల బీజీఎంను గుర్తుచేస్తుంది. రాజా మహాదేవన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్‌ రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌లో మరికొంత శ్రద్ధ పెట్టాల్సింది. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు మహేశ్‌ ఉప్పల కొత్త కథను చెప్పే ప్రయత్నం చేసినా.. కథనంలో వేగం, కామెడీ, లాజిక్‌ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది.

ఫైనల్‌గా: ‘ఇట్లు అర్జున’లో కొత్త హీరో అనీష్‌ నటన, ప్రేమకథ, యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే కామెడీ, కథనంలోని సాగతీత, కొన్ని లాజిక్‌లేని సన్నివేశాలు నిరాశపరుస్తాయి. కొత్త హీరోల ప్రయత్నాలను ప్రోత్సహించే ప్రేక్షకులు, ప్రేమతో పాటు యాక్షన్‌ అంశాలను ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు.

రేటింగ్‌: 3/5



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 10:06 am Digital Edition : Prabhanews
Itlu Arjuna Movie Review: ‘ఇట్లు అర్జున’ మూవీ రివ్యూ… ఈ క్రేజీ థ్రిల్లర్ లవ్‌స్టోరీ ప్రేక్షకులను మెప్పించిందా? | తెలుగు సినిమా వార్తలు

కథేంటంటే?అర్జున్‌ (అనీష్‌ రెడ్డి) పుట్టుకతోనే మాటలు రాని యువకుడు. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి దొంగతనాలు చేస్తూ పెరుగుతాడు. ఓ దొంగతనం సమయంలో పోలీసులకు చిక్కడంతో జైలు జీవితం అనుభవించాల్సి వస్తుంది. తండ్రిని కోల్పోయిన అర్జున్‌.. జైలు నుంచి బయటకు వచ్చాక ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. మరోవైపు తన చిన్ననాటి స్నేహితురాలు కీర్తి (అనస్వర రాజన్‌)ను ప్రేమిస్తుంటాడు. అయితే మాటలు రాకపోవడంతో తన ప్రేమను ఆమెకు ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతుంటాడు.ఇదిలా ఉంటే.. పాతబస్తీకి చెందిన పెద్దన్న (ముఖేష్‌ రిషి) తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం రూ.1000 కోట్ల హవాలా డబ్బును సమకూర్చే ప్రయత్నం చేస్తాడు. ఈ వ్యవహారంలో ఓ పెన్‌డ్రైవ్‌, పాస్‌వర్డ్‌ అర్జున్‌కు ముడిపడతాయి. దీంతో అతడి జీవితం ఒక్కసారిగా ప్రమాదంలో పడుతుంది. అసలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముంది? దాని కోసం అర్జున్‌ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? కీర్తి తన ప్రేమను అంగీకరించిందా? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే?మూగ యువకుడి ప్రేమకథకు క్రైమ్‌ థ్రిల్లర్‌ అంశాలను జోడించి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోకు మాటలు రాకపోవడం, తన భావాలను హావభావాలతో వ్యక్తపరచడం అనే ప్రధాన పాయింట్‌ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా అర్జున్‌, కీర్తి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. మాటలు లేకుండానే ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో పడే తపన కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది.ఫస్టాఫ్‌లో ఎక్కువగా ప్రేమకథపైనే దృష్టి పెట్టారు. మరోవైపు వెయ్యి కోట్ల హవాలా వ్యవహారాన్ని కూడా సమాంతరంగా నడిపిస్తూ కథపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. కామెడీ ఆశించిన స్థాయిలో పండకపోవడం కూడా కొంత నిరాశ కలిగిస్తుంది.సెకండాఫ్‌లో కథ పూర్తిగా క్రైమ్‌ థ్రిల్లర్‌ వైపు మళ్లుతుంది. పెన్‌డ్రైవ్‌, హవాలా డబ్బు చుట్టూ జరిగే పరిణామాలు, మాఫియా గ్యాంగ్‌తో అర్జున్‌ తలపడే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో జాతర నేపథ్యంలో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని ట్విస్టులు, సన్నివేశాల్లో లాజిక్‌ లోపించడం మైనస్‌గా మారింది. స్క్రీన్‌ప్లేపై పెట్టిన శ్రద్ధ కథలోని లాజిక్‌పైనా పెట్టి ఉంటే సినిమా మరింత బాగుండేది.ప్లస్ పాయింట్స్:- కొత్త తరహా ప్రేమకథ- అనీష్‌ రెడ్డి నటన, హావభావాలు- అనస్వర రాజన్‌ సహజమైన నటన- యాక్షన్‌ సన్నివేశాలు- జాతర నేపథ్యంలో వచ్చే ప్రీ క్లైమాక్స్‌ ఎపిసోడ్‌- సినిమాటోగ్రఫీ, విజువల్స్‌మైనస్ పాయింట్స్:- అక్కడక్కడా నెమ్మదించే కథనం- కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవడం- కొన్ని లాజిక్‌లేని సన్నివేశాలుఎవరెలా చేశారంటే?హీరోగా అనీష్‌ రెడ్డికి ఇది తొలి సినిమా అయినప్పటికీ అర్జున్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా మాటలు లేకుండా హావభావాలతో భావాలను పలికించిన తీరు బాగుంది. డాన్సులు, యాక్షన్‌ సన్నివేశాల్లోనూ తన ప్రతిభ చూపించాడు. హీరోయిన్‌ అనస్వర రాజన్‌ అందంగా కనిపించడంతో పాటు సహజమైన నటనతో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్‌ కామెడీ మాత్రం ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. బ్రహ్మాజీ, రఘుబాబు, గెటప్‌ శ్రీను తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ముఖేష్‌ రిషి విలన్‌గా కనిపించినా ఆయన పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది.సాంకేతికంగా ఎలా ఉందంటే?తమన్‌ అందించిన పాటలు ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం యాక్షన్‌ సన్నివేశాలకు బలాన్ని ఇచ్చింది. అయితే కొన్ని చోట్ల ఇతర సినిమాల బీజీఎంను గుర్తుచేస్తుంది. రాజా మహాదేవన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్‌ రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌లో మరికొంత శ్రద్ధ పెట్టాల్సింది. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు మహేశ్‌ ఉప్పల కొత్త కథను చెప్పే ప్రయత్నం చేసినా.. కథనంలో వేగం, కామెడీ, లాజిక్‌ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది.ఫైనల్‌గా: ‘ఇట్లు అర్జున’లో కొత్త హీరో అనీష్‌ నటన, ప్రేమకథ, యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే కామెడీ, కథనంలోని సాగతీత, కొన్ని లాజిక్‌లేని సన్నివేశాలు నిరాశపరుస్తాయి. కొత్త హీరోల ప్రయత్నాలను ప్రోత్సహించే ప్రేక్షకులు, ప్రేమతో పాటు యాక్షన్‌ అంశాలను ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు.రేటింగ్‌: 3/5

Source link