ప్రభన్యూస్

Coconut Sweet: ఇంట్లోనే కొబ్బరి బర్ఫీ తయారు చేసుకోండి.. తక్కువ సమయంలోనే నోరూరించే స్వీట్ రెడీ! | లైఫ్ స్టైల్


Last Updated:

ఇంట్లోనే రుచికరమైన స్వీట్ తయారుచేయాలనుకుంటున్నారా? అయితే కొబ్బరి బర్ఫీ మంచి ఎంపిక. పాలు, తాజా కొబ్బరి, పంచదారతో తయారయ్యే ఈ స్వీట్ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మరి స్వీట్ షాప్ తరహాలో కొబ్బరి బర్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం.

News18
News18

బయట నుంచి స్వీట్స్ కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే శుభ్రమైన పదార్థాలతో తయారుచేసుకోవడం మంచిది. అలాంటి సులభమైన వంటకాల్లో కొబ్బరి బర్ఫీ ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ స్వీట్‌ను తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. పాలు, కొబ్బరి, పంచదారతో చేసే ఈ బర్ఫీ మృదువుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. మరి దీన్ని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం.

కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు

ఈ స్వీట్ తయారీకి రెండు కప్పుల తాజా తురిమిన కొబ్బరి లేదా డెసికేటెడ్ కొబ్బరి పొడి తీసుకోవాలి. తీపి కోసం ఒకటి నుంచి ఒకటిన్నర కప్పుల పంచదార అవసరం. అలాగే ఒక కప్పు ఫుల్ క్రీమ్ పాలు, అర కప్పు మలై లేదా మావా (ఖోవా) ఉపయోగించాలి. వీటితో పాటు అర టీస్పూన్ యాలకుల పొడి, అలంకరణ కోసం సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం ముక్కలు సిద్ధం చేసుకోవాలి. కొబ్బరిని వేయించడానికి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా అవసరం.

ముందుగా కొబ్బరిని వేయించుకోవాలి

మొదట తాజా కొబ్బరిని ఉపయోగిస్తుంటే దాని వెనుక ఉండే నల్లటి పొరను తొలగించాలి. అనంతరం కొబ్బరిని తురుముకోవాలి లేదా మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మందపాటి అడుగున్న బాణలి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత కొబ్బరి తురుము వేసి మీడియం మంటపై రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించాలి. పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు కలుపుతుండాలి. అయితే కొబ్బరి రంగు ఎక్కువగా మారకుండా జాగ్రత్తపడాలి.

పాలు, పంచదారతో మిశ్రమం సిద్ధం

ఇప్పుడు వేయించిన కొబ్బరిలో ఒక కప్పు ఫుల్ క్రీమ్ పాలు, మలై లేదా మావా వేసి బాగా కలపాలి. పాలు తగ్గి కొబ్బరి మెత్తబడే వరకు మీడియం మంటపై ఉడికించాలి. ఆ తర్వాత పంచదార జోడించాలి. అది కరిగినప్పుడు మిశ్రమం పలుచగా మారుతుంది. ఈ సమయంలో అడుగున అంటకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడి బాణలి అంచులను వదులుతున్నప్పుడు యాలకుల పొడి వేసి కలపాలి.

చల్లారిన తర్వాత ముక్కలుగా కోయాలి

ఒక ప్లేట్ లేదా ట్రేకు కొద్దిగా నెయ్యి రాసి సిద్ధం చేసుకోవాలి. అందులో కొబ్బరి మిశ్రమాన్ని వేసి సమానంగా పరచాలి. పైన జీడిపప్పు, బాదం ముక్కలు చల్లి కొద్దిగా నొక్కాలి. తర్వాత ఒకటి నుంచి రెండు గంటల పాటు చల్లారనివ్వాలి. మిశ్రమం గట్టిపడి సెట్ అయిన తర్వాత మీకు నచ్చినట్లు చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారంలో ముక్కలుగా కోసుకోవాలి. అంతే.. రుచికరమైన కొబ్బరి బర్ఫీ సిద్ధం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 11:17 pm Digital Edition : Prabhanews
Coconut Sweet: ఇంట్లోనే కొబ్బరి బర్ఫీ తయారు చేసుకోండి.. తక్కువ సమయంలోనే నోరూరించే స్వీట్ రెడీ! | లైఫ్ స్టైల్

Last Updated:Nov 12, 2026 11:06 PM ISTఇంట్లోనే రుచికరమైన స్వీట్ తయారుచేయాలనుకుంటున్నారా? అయితే కొబ్బరి బర్ఫీ మంచి ఎంపిక. పాలు, తాజా కొబ్బరి, పంచదారతో తయారయ్యే ఈ స్వీట్ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మరి స్వీట్ షాప్ తరహాలో కొబ్బరి బర్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం.News18బయట నుంచి స్వీట్స్ కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే శుభ్రమైన పదార్థాలతో తయారుచేసుకోవడం మంచిది. అలాంటి సులభమైన వంటకాల్లో కొబ్బరి బర్ఫీ ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ స్వీట్‌ను తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. పాలు, కొబ్బరి, పంచదారతో చేసే ఈ బర్ఫీ మృదువుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. మరి దీన్ని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం.కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలుఈ స్వీట్ తయారీకి రెండు కప్పుల తాజా తురిమిన కొబ్బరి లేదా డెసికేటెడ్ కొబ్బరి పొడి తీసుకోవాలి. తీపి కోసం ఒకటి నుంచి ఒకటిన్నర కప్పుల పంచదార అవసరం. అలాగే ఒక కప్పు ఫుల్ క్రీమ్ పాలు, అర కప్పు మలై లేదా మావా (ఖోవా) ఉపయోగించాలి. వీటితో పాటు అర టీస్పూన్ యాలకుల పొడి, అలంకరణ కోసం సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం ముక్కలు సిద్ధం చేసుకోవాలి. కొబ్బరిని వేయించడానికి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా అవసరం.ముందుగా కొబ్బరిని వేయించుకోవాలిమొదట తాజా కొబ్బరిని ఉపయోగిస్తుంటే దాని వెనుక ఉండే నల్లటి పొరను తొలగించాలి. అనంతరం కొబ్బరిని తురుముకోవాలి లేదా మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మందపాటి అడుగున్న బాణలి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత కొబ్బరి తురుము వేసి మీడియం మంటపై రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించాలి. పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు కలుపుతుండాలి. అయితే కొబ్బరి రంగు ఎక్కువగా మారకుండా జాగ్రత్తపడాలి.పాలు, పంచదారతో మిశ్రమం సిద్ధంఇప్పుడు వేయించిన కొబ్బరిలో ఒక కప్పు ఫుల్ క్రీమ్ పాలు, మలై లేదా మావా వేసి బాగా కలపాలి. పాలు తగ్గి కొబ్బరి మెత్తబడే వరకు మీడియం మంటపై ఉడికించాలి. ఆ తర్వాత పంచదార జోడించాలి. అది కరిగినప్పుడు మిశ్రమం పలుచగా మారుతుంది. ఈ సమయంలో అడుగున అంటకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడి బాణలి అంచులను వదులుతున్నప్పుడు యాలకుల పొడి వేసి కలపాలి.చల్లారిన తర్వాత ముక్కలుగా కోయాలిఒక ప్లేట్ లేదా ట్రేకు కొద్దిగా నెయ్యి రాసి సిద్ధం చేసుకోవాలి. అందులో కొబ్బరి మిశ్రమాన్ని వేసి సమానంగా పరచాలి. పైన జీడిపప్పు, బాదం ముక్కలు చల్లి కొద్దిగా నొక్కాలి. తర్వాత ఒకటి నుంచి రెండు గంటల పాటు చల్లారనివ్వాలి. మిశ్రమం గట్టిపడి సెట్ అయిన తర్వాత మీకు నచ్చినట్లు చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారంలో ముక్కలుగా కోసుకోవాలి. అంతే.. రుచికరమైన కొబ్బరి బర్ఫీ సిద్ధం.మరింత చదవండి

Source link