ప్రభుత్వ అధికారిక పనులు చేసుకోవడానికి అర్హత ఉన్న అధికారులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, నోట్‌ప్యాడ్‌లు, అల్ట్రాబుక్‌లు, నోట్‌బుక్‌లు, ఇలాంటి ఇతర డివైజ్‌లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 2023 జూలై మార్గదర్శకాల స్థానంలో ఈ కొత్త నిబంధనలు వచ్చాయి. అప్పటి మార్గదర్శకాల్లో మొబైల్ డివైజ్‌ల కొనుగోలు గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే 2026 నవంబర్ 10న విడుదల చేసిన కొత్త ఆఫీస్ మెమోరాండంలో మొబైల్ డివైజ్‌ల ప్రస్తావన లేదు. (ప్రతీకాత్మక చిత్రం)

