ప్రభన్యూస్

TRAI New Rules: మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. 2027 జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. TRAI సంచలన నిర్ణయం? | బిజినెస్


Last Updated:

TRAI New Rules: మీరు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లేదా బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నారా? అయితే మీకో ముఖ్యమైన అప్‌డేట్. టెలికాం రంగంలో కీలక మార్పులకు TRAI సిద్ధమైంది. మరి అదేంటో తెలుసా?

News18
News18

ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తున్నవారికి బిగ్ అలర్ట్. రోజూ ఫోన్ కాల్స్ చేయడం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియోలు, రీల్స్ చూస్తున్నారా? అయితే టెలికాం రంగానికి సంబంధించిన ఓ కీలక మార్పు గురించి తెలుసుకోవాలి. దేశంలో టెలికాం సేవలను పర్యవేక్షించే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం కంపెనీలు ఒకదానితో మరొకటి తమ నెట్‌వర్క్‌లను అనుసంధానించుకునే విధానానికి సంబంధించి కొత్త నిబంధనలను ప్రకటించింది. ముఖ్యంగా ఆధునిక IP ఆధారిత నెట్‌వర్క్‌లకు సంబంధించిన పోర్ట్ ఛార్జీలపై కొత్త పరిమితులను విధించింది. ఈ మార్పులు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని వల్ల టెలికాం కంపెనీల మధ్య ఇంటర్‌కనెక్షన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారనుంది. అసలు TRAI తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు ఏంటి? టెలికాం కంపెనీలకు ఎలాంటి ప్రయోజనం కలగనుందో తెలుసా?

TRAI కొత్త రూల్స్ ఎందుకు తీసుకొచ్చింది?

సాధారణంగా మనం ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు ఫోన్ చేసినప్పుడు కాల్ వెంటనే కనెక్ట్ అవుతుంది. ఉదాహరణకు జియో యూజర్ ఎయిర్‌టెల్ నంబర్‌కు కాల్ చేసినా, లేదా వొడాఫోన్ ఐడియా నుంచి బీఎస్ఎన్ఎల్ నంబర్‌కు కాల్ చేసినా అవతలి వ్యక్తికి కాల్ వెళ్తుంది. ఇలా వేర్వేరు టెలికాం కంపెనీల నెట్‌వర్క్‌లు ఒకదానితో మరొకటి అనుసంధానమై పనిచేసే విధానాన్నే ఇంటర్‌కనెక్షన్ అంటారు. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి టెలికాం కంపెనీల మధ్య సాంకేతిక, వాణిజ్యపరమైన ఒప్పందాలు అవసరం. అయితే గత కొన్నేళ్లుగా టెలికాం రంగంలో సాంకేతికత వేగంగా మారుతోంది. గతంలో ఎక్కువగా ఉపయోగించిన E1/TDM ఆధారిత నెట్‌వర్క్‌ల స్థానంలో ఇప్పుడు IP ఆధారిత సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతోంది. కానీ ఇంటర్‌కనెక్షన్ పోర్ట్ ఛార్జీలకు సంబంధించిన పాత నిబంధనలు ప్రధానంగా E1 టెక్నాలజీ ఆధారంగానే ఉన్నాయి. ఈ ఛార్జీలను చివరిసారిగా 2012లో సవరించారు. మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను మార్చాల్సిన అవసరం ఏర్పడటంతో TRAI ఈ నిర్ణయం తీసుకుంది.

2027 జనవరి 1 నుంచి ఏం మారుతాయంటే?

TRAI విడుదల చేసిన టెలికమ్యూనికేషన్ ఇంటర్‌కనెక్షన్ నిబంధనల ప్రకారం.. 2026 ద్వారా IP ఆధారిత పోర్ట్‌లకు ప్రత్యేక ఛార్జీల విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 1 Gbps సామర్థ్యం ఉన్న IP పోర్ట్‌కు ఏడాదికి గరిష్ఠంగా రూ.5.6 లక్షలు, 10 Gbps సామర్థ్యం ఉన్న పోర్ట్‌కు రూ.42.3 లక్షల వరకు ఛార్జీలను నిర్ణయించింది. అయితే ఇవి గరిష్ఠ పరిమితులు మాత్రమే. టెలికాం కంపెనీలు పరస్పరం చర్చించుకుని ఈ పరిమితుల కంటే తక్కువ ఛార్జీలకు కూడా ఒప్పందం చేసుకోవచ్చు. అలాగే 1 Gbps, 10 Gbps కాకుండా ఇతర సామర్థ్యాలు కలిగిన IP పోర్ట్‌లకు కూడా ఇదే విధానాన్ని అనుసరించి ఛార్జీలను నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ ఒప్పందాల్లో పారదర్శకత ఉండాలి.

అన్ని టెలికాం సేవలకు ఒకే విధానం

ఈ కొత్త నిబంధనల్లో మరో ముఖ్యమైన మార్పు కూడా ఉంది. ఫిక్స్‌డ్ లైన్, మొబైల్, జాతీయ లాంగ్ డిస్టెన్స్, అంతర్జాతీయ లాంగ్ డిస్టెన్స్ సేవలకు IP పోర్ట్ ఛార్జీలు ఒకే విధంగా వర్తిస్తాయి. గతంలో ఉన్న నిబంధనలు ప్రధానంగా E1 పోర్ట్‌లకు సంబంధించినవే. ఇప్పుడు IP ఆధారిత పోర్ట్‌లను కూడా ఈ నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో వేర్వేరు సేవలకు వేర్వేరు విధానాలు ఉండే పరిస్థితి తగ్గనుంది. కొత్త నిబంధనలను టెలికాం కంపెనీలు తప్పనిసరిగా పాటించేలా TRAI ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిబంధనల్లో పేర్కొన్న కొన్ని అంశాలను ఉల్లంఘిస్తే ఆర్థిక నిరుత్సాహకాల విధానాన్ని అమలు చేయనుంది. ప్రతి ఉల్లంఘనకు, ప్రతి సర్వీస్ ఏరియాకు గరిష్ఠంగా రూ.15 లక్షల పరిమితితో ఈ విధానాన్ని రూపొందించింది.

టెలికాం రంగానికి వచ్చే లాభమేంటి?

ఈ మార్పుల ద్వారా ఆధునిక నెట్‌వర్క్ టెక్నాలజీకి అనుగుణంగా ఇంటర్‌కనెక్షన్ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని TRAI భావిస్తోంది. టెలికాం కంపెనీల మధ్య ఛార్జీల విషయంలో పారదర్శకత పెరగడంతో పాటు వివక్ష లేకుండా నెట్‌వర్క్ అనుసంధానానికి అవకాశం కలుగుతుంది. అలాగే కంపెనీల మధ్య న్యాయమైన పోటీకి, మెరుగైన సాంకేతిక సేవల విస్తరణకు ఈ నిబంధనలు తోడ్పడతాయని అంచనా వేస్తోంది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. పూర్తి వివరాలను TRAI అధికారిక వెబ్‌సైట్‌లో (www.trai.gov.in) తెలుసుకోవచ్చు.

యూజర్లకు కలిగే లాభాలివే?

ఈ కొత్త నిబంధనల వల్ల మొబైల్ వినియోగదారులకు దీర్ఘకాలంలో కొన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీల మధ్య నెట్‌వర్క్ అనుసంధానం మరింత సమర్థంగా జరిగేందుకు వీలుంటుంది. దీనివల్ల వేర్వేరు నెట్‌వర్క్‌ల మధ్య ఫోన్ కాల్స్ కనెక్ట్ కావడంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు తగ్గవచ్చు. అలాగే ఆధునిక IP ఆధారిత టెక్నాలజీ వినియోగం పెరగడంతో నెట్‌వర్క్ సామర్థ్యం మెరుగుపడి, డేటా ట్రాఫిక్ నిర్వహణ మరింత సులభమవుతుంది. కంపెనీల మధ్య పోర్ట్ ఛార్జీల విషయంలో పారదర్శకత పెరగడం, న్యాయమైన పోటీకి అవకాశం కలగడం వల్ల భవిష్యత్తులో మెరుగైన టెలికాం సేవలు అందించేందుకు మార్గం ఏర్పడుతుంది. అయితే ఈ మార్పులతో వెంటనే రీఛార్జ్ ధరలు తగ్గుతాయని లేదా ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందని చెప్పలేం. వీటి ప్రయోజనాలు వినియోగదారులకు అందాలంటే టెలికాం కంపెనీలు కూడా తమ నెట్‌వర్క్ వ్యవస్థలను మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 6:47 pm Digital Edition : Prabhanews
TRAI New Rules: మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. 2027 జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. TRAI సంచలన నిర్ణయం? | బిజినెస్

Last Updated:Nov 09, 2026 6:45 PM ISTTRAI New Rules: మీరు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లేదా బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నారా? అయితే మీకో ముఖ్యమైన అప్‌డేట్. టెలికాం రంగంలో కీలక మార్పులకు TRAI సిద్ధమైంది. మరి అదేంటో తెలుసా?
News18ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తున్నవారికి బిగ్ అలర్ట్. రోజూ ఫోన్ కాల్స్ చేయడం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియోలు, రీల్స్ చూస్తున్నారా? అయితే టెలికాం రంగానికి సంబంధించిన ఓ కీలక మార్పు గురించి తెలుసుకోవాలి. దేశంలో టెలికాం సేవలను పర్యవేక్షించే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం కంపెనీలు ఒకదానితో మరొకటి తమ నెట్‌వర్క్‌లను అనుసంధానించుకునే విధానానికి సంబంధించి కొత్త నిబంధనలను ప్రకటించింది. ముఖ్యంగా ఆధునిక IP ఆధారిత నెట్‌వర్క్‌లకు సంబంధించిన పోర్ట్ ఛార్జీలపై కొత్త పరిమితులను విధించింది. ఈ మార్పులు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని వల్ల టెలికాం కంపెనీల మధ్య ఇంటర్‌కనెక్షన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారనుంది. అసలు TRAI తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు ఏంటి? టెలికాం కంపెనీలకు ఎలాంటి ప్రయోజనం కలగనుందో తెలుసా?TRAI కొత్త రూల్స్ ఎందుకు తీసుకొచ్చింది?సాధారణంగా మనం ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు ఫోన్ చేసినప్పుడు కాల్ వెంటనే కనెక్ట్ అవుతుంది. ఉదాహరణకు జియో యూజర్ ఎయిర్‌టెల్ నంబర్‌కు కాల్ చేసినా, లేదా వొడాఫోన్ ఐడియా నుంచి బీఎస్ఎన్ఎల్ నంబర్‌కు కాల్ చేసినా అవతలి వ్యక్తికి కాల్ వెళ్తుంది. ఇలా వేర్వేరు టెలికాం కంపెనీల నెట్‌వర్క్‌లు ఒకదానితో మరొకటి అనుసంధానమై పనిచేసే విధానాన్నే ఇంటర్‌కనెక్షన్ అంటారు. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి టెలికాం కంపెనీల మధ్య సాంకేతిక, వాణిజ్యపరమైన ఒప్పందాలు అవసరం. అయితే గత కొన్నేళ్లుగా టెలికాం రంగంలో సాంకేతికత వేగంగా మారుతోంది. గతంలో ఎక్కువగా ఉపయోగించిన E1/TDM ఆధారిత నెట్‌వర్క్‌ల స్థానంలో ఇప్పుడు IP ఆధారిత సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతోంది. కానీ ఇంటర్‌కనెక్షన్ పోర్ట్ ఛార్జీలకు సంబంధించిన పాత నిబంధనలు ప్రధానంగా E1 టెక్నాలజీ ఆధారంగానే ఉన్నాయి. ఈ ఛార్జీలను చివరిసారిగా 2012లో సవరించారు. మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను మార్చాల్సిన అవసరం ఏర్పడటంతో TRAI ఈ నిర్ణయం తీసుకుంది.2027 జనవరి 1 నుంచి ఏం మారుతాయంటే?TRAI విడుదల చేసిన టెలికమ్యూనికేషన్ ఇంటర్‌కనెక్షన్ నిబంధనల ప్రకారం.. 2026 ద్వారా IP ఆధారిత పోర్ట్‌లకు ప్రత్యేక ఛార్జీల విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 1 Gbps సామర్థ్యం ఉన్న IP పోర్ట్‌కు ఏడాదికి గరిష్ఠంగా రూ.5.6 లక్షలు, 10 Gbps సామర్థ్యం ఉన్న పోర్ట్‌కు రూ.42.3 లక్షల వరకు ఛార్జీలను నిర్ణయించింది. అయితే ఇవి గరిష్ఠ పరిమితులు మాత్రమే. టెలికాం కంపెనీలు పరస్పరం చర్చించుకుని ఈ పరిమితుల కంటే తక్కువ ఛార్జీలకు కూడా ఒప్పందం చేసుకోవచ్చు. అలాగే 1 Gbps, 10 Gbps కాకుండా ఇతర సామర్థ్యాలు కలిగిన IP పోర్ట్‌లకు కూడా ఇదే విధానాన్ని అనుసరించి ఛార్జీలను నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ ఒప్పందాల్లో పారదర్శకత ఉండాలి.అన్ని టెలికాం సేవలకు ఒకే విధానంఈ కొత్త నిబంధనల్లో మరో ముఖ్యమైన మార్పు కూడా ఉంది. ఫిక్స్‌డ్ లైన్, మొబైల్, జాతీయ లాంగ్ డిస్టెన్స్, అంతర్జాతీయ లాంగ్ డిస్టెన్స్ సేవలకు IP పోర్ట్ ఛార్జీలు ఒకే విధంగా వర్తిస్తాయి. గతంలో ఉన్న నిబంధనలు ప్రధానంగా E1 పోర్ట్‌లకు సంబంధించినవే. ఇప్పుడు IP ఆధారిత పోర్ట్‌లను కూడా ఈ నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో వేర్వేరు సేవలకు వేర్వేరు విధానాలు ఉండే పరిస్థితి తగ్గనుంది. కొత్త నిబంధనలను టెలికాం కంపెనీలు తప్పనిసరిగా పాటించేలా TRAI ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిబంధనల్లో పేర్కొన్న కొన్ని అంశాలను ఉల్లంఘిస్తే ఆర్థిక నిరుత్సాహకాల విధానాన్ని అమలు చేయనుంది. ప్రతి ఉల్లంఘనకు, ప్రతి సర్వీస్ ఏరియాకు గరిష్ఠంగా రూ.15 లక్షల పరిమితితో ఈ విధానాన్ని రూపొందించింది.టెలికాం రంగానికి వచ్చే లాభమేంటి?ఈ మార్పుల ద్వారా ఆధునిక నెట్‌వర్క్ టెక్నాలజీకి అనుగుణంగా ఇంటర్‌కనెక్షన్ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని TRAI భావిస్తోంది. టెలికాం కంపెనీల మధ్య ఛార్జీల విషయంలో పారదర్శకత పెరగడంతో పాటు వివక్ష లేకుండా నెట్‌వర్క్ అనుసంధానానికి అవకాశం కలుగుతుంది. అలాగే కంపెనీల మధ్య న్యాయమైన పోటీకి, మెరుగైన సాంకేతిక సేవల విస్తరణకు ఈ నిబంధనలు తోడ్పడతాయని అంచనా వేస్తోంది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. పూర్తి వివరాలను TRAI అధికారిక వెబ్‌సైట్‌లో (www.trai.gov.in) తెలుసుకోవచ్చు.యూజర్లకు కలిగే లాభాలివే?ఈ కొత్త నిబంధనల వల్ల మొబైల్ వినియోగదారులకు దీర్ఘకాలంలో కొన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీల మధ్య నెట్‌వర్క్ అనుసంధానం మరింత సమర్థంగా జరిగేందుకు వీలుంటుంది. దీనివల్ల వేర్వేరు నెట్‌వర్క్‌ల మధ్య ఫోన్ కాల్స్ కనెక్ట్ కావడంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు తగ్గవచ్చు. అలాగే ఆధునిక IP ఆధారిత టెక్నాలజీ వినియోగం పెరగడంతో నెట్‌వర్క్ సామర్థ్యం మెరుగుపడి, డేటా ట్రాఫిక్ నిర్వహణ మరింత సులభమవుతుంది. కంపెనీల మధ్య పోర్ట్ ఛార్జీల విషయంలో పారదర్శకత పెరగడం, న్యాయమైన పోటీకి అవకాశం కలగడం వల్ల భవిష్యత్తులో మెరుగైన టెలికాం సేవలు అందించేందుకు మార్గం ఏర్పడుతుంది. అయితే ఈ మార్పులతో వెంటనే రీఛార్జ్ ధరలు తగ్గుతాయని లేదా ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందని చెప్పలేం. వీటి ప్రయోజనాలు వినియోగదారులకు అందాలంటే టెలికాం కంపెనీలు కూడా తమ నెట్‌వర్క్ వ్యవస్థలను మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.మరింత చదవండి

Source link