పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకెళ్తున్న రామాయణం తొలిరోజు భారీ వసూళ్లనే రాబట్టింది. దేశవ్యాప్తంగా మొదటి రోజు రూ. 64.85 కోట్ల నికర (Net) వసూళ్లు సాధించింది. అయితే, హిందీ బెల్ట్ లో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన రాగా, దక్షిణాదిలో కాస్త నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘రావణాసురుడి’ పాత్రలో నటించినప్పటికీ కన్నడ నాట కేవలం రూ. 7.25 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక తెలుగులో రణ్బీర్, సాయి పల్లవిల నటనకు ప్రశంసలు దక్కుతుండటంతో మంచి వసూళ్లు వస్తుండగా, తమిళ, మలయాళ భాషల్లో డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసింది.

