లోన్స్ తీసుకోవడంమే కాదు లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడం లోనే పలు మార్పులు చోటుచేసుకున్నట్లు తెలిపింది. 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం బకాయి ఉన్న ఖాతాలు కలిగిన యాక్టివ్ బంగారు రుణగ్రహీతల వాటా జూన్ 2025లో 2 శాతంగా ఉండగా, జూన్ 2026 నాటికి 1.4 శాతానికి తగ్గింది. అయితే గత ఆరు నెలల్లో ఒకటి కంటే ఎక్కువ చెల్లింపులు మిస్ అయినవారు, తర్వాతి 6 నెలల్లో మరో రుణ చెల్లింపులో విఫలమయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉందని నివేదిక హెచ్చరించింది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఎండీ, సీఈఓ భావేష్ జైన్ మాట్లాడుతూ.. రుణదాతలు బంగారం విలువను మాత్రమే కాకుండా, రుణగ్రహీతల మొత్తం అప్పులు, చెల్లింపు సామర్థ్యాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. బంగారు రుణాల మార్కెట్ మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో, రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే ఈ రంగంలో స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుందని నివేదిక పేర్కొంది.

