ప్రభన్యూస్

Missing: సాయంత్రం నడకకు వెళ్లి తిరిగి రాలేదు.. బోస్టన్‌లో నల్గొండ యువతి అదృశ్యం |


Last Updated:

Missing: ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడుతుందనుకున్న ఒక్కగానొక్క కుమార్తె విదేశాల్లో అదృశ్యం కావడంతో ఒక కుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది.

శ్రీజ
శ్రీజ

ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన యువతి అక్కడ కనిపించకుండా పోవడం కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో స్వగ్రామంలోని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కనగల్ మండలం శబ్దులాపురం గ్రామానికి చెందిన కోయ్య యాదగిరిరెడ్డి, రూప దంపతులకు కుమార్తె శ్రీజ (23) ఒక్కరే సంతానం. ఉన్నత చదువులపై ఉన్న ఆసక్తితో శ్రీజ ఏడాది క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికాలోని బోస్టన్‌ నగరానికి వెళ్లింది. అక్కడ ఓ కళాశాలలో విద్యనభ్యసిస్తూనే మరోవైపు పార్ట్‌టైమ్ జాబ్ చేస్తోంది.

ఈ క్రమంలో నవంబరు 2వ తేదీ సాయంత్రం వేళ నివాసం నుంచి నడక (ఈవెనింగ్ వాక్) కోసం బయటకు వెళ్లిన శ్రీజ ఎంతసేపటికీ తిరిగి రాలేదు. రాత్రయినా రూమ్‌కు చేరుకోకపోవడంతో పాటు ఆమెకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తోటి స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే బోస్టన్ స్థానిక పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి సమాచారం అందించారు.

బీచ్ పరిసరాల్లో మొబైల్ లొకేషన్

స్నేహితులు, పోలీసులు ఆమె ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేయగా, శ్రీజ సెల్‌ఫోన్ చివరి లొకేషన్ సమీపంలోని సముద్ర తీర (బీచ్/స్క్వాంటమ్ ఛానల్) ప్రాంతంలో చూపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే అప్పటి నుంచి ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ అయిపోవడం, ఎంత గాలించినా ఎలాంటి జాడ లభించకపోవడంతో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. బోస్టన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని శ్రీజ ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

మంత్రి కోమటిరెడ్డిని వేడుకున్న తల్లిదండ్రులు

ఏడాది క్రితం ఎంతో సంతోషంగా వీడ్కోలు పలికి పంపిన కన్నబిడ్డ సుదూర దేశంలో కనిపించకుండా పోయిందన్న వార్త తెలియడంతో శబ్దులాపురంలోని ఆమె తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కంటికి రెప్పలా చూసుకున్న ఒక్కగానొక్క కుమార్తె ఆచూకీ దొరక్కపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.

గురువారం నాడు నల్గొండ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని శ్రీజ తల్లిదండ్రులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కుమార్తెను సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకున్నారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో పాటు అక్కడి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బోస్టన్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను వేగవంతం చేసి, యువతి ఆచూకీని త్వరగా కనిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. శ్రీజ క్షేమంగా తిరిగి రావాలని ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 6:31 am Digital Edition : Prabhanews
Missing: సాయంత్రం నడకకు వెళ్లి తిరిగి రాలేదు.. బోస్టన్‌లో నల్గొండ యువతి అదృశ్యం |

Last Updated:Nov 06, 2026 6:30 AM ISTMissing: ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడుతుందనుకున్న ఒక్కగానొక్క కుమార్తె విదేశాల్లో అదృశ్యం కావడంతో ఒక కుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది.శ్రీజఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన యువతి అక్కడ కనిపించకుండా పోవడం కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో స్వగ్రామంలోని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కనగల్ మండలం శబ్దులాపురం గ్రామానికి చెందిన కోయ్య యాదగిరిరెడ్డి, రూప దంపతులకు కుమార్తె శ్రీజ (23) ఒక్కరే సంతానం. ఉన్నత చదువులపై ఉన్న ఆసక్తితో శ్రీజ ఏడాది క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికాలోని బోస్టన్‌ నగరానికి వెళ్లింది. అక్కడ ఓ కళాశాలలో విద్యనభ్యసిస్తూనే మరోవైపు పార్ట్‌టైమ్ జాబ్ చేస్తోంది.ఈ క్రమంలో నవంబరు 2వ తేదీ సాయంత్రం వేళ నివాసం నుంచి నడక (ఈవెనింగ్ వాక్) కోసం బయటకు వెళ్లిన శ్రీజ ఎంతసేపటికీ తిరిగి రాలేదు. రాత్రయినా రూమ్‌కు చేరుకోకపోవడంతో పాటు ఆమెకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తోటి స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే బోస్టన్ స్థానిక పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి సమాచారం అందించారు.బీచ్ పరిసరాల్లో మొబైల్ లొకేషన్స్నేహితులు, పోలీసులు ఆమె ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేయగా, శ్రీజ సెల్‌ఫోన్ చివరి లొకేషన్ సమీపంలోని సముద్ర తీర (బీచ్/స్క్వాంటమ్ ఛానల్) ప్రాంతంలో చూపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే అప్పటి నుంచి ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ అయిపోవడం, ఎంత గాలించినా ఎలాంటి జాడ లభించకపోవడంతో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. బోస్టన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని శ్రీజ ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.మంత్రి కోమటిరెడ్డిని వేడుకున్న తల్లిదండ్రులుఏడాది క్రితం ఎంతో సంతోషంగా వీడ్కోలు పలికి పంపిన కన్నబిడ్డ సుదూర దేశంలో కనిపించకుండా పోయిందన్న వార్త తెలియడంతో శబ్దులాపురంలోని ఆమె తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కంటికి రెప్పలా చూసుకున్న ఒక్కగానొక్క కుమార్తె ఆచూకీ దొరక్కపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.గురువారం నాడు నల్గొండ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని శ్రీజ తల్లిదండ్రులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కుమార్తెను సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకున్నారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో పాటు అక్కడి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బోస్టన్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను వేగవంతం చేసి, యువతి ఆచూకీని త్వరగా కనిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. శ్రీజ క్షేమంగా తిరిగి రావాలని ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.మరింత చదవండి

Source link