దీన్ని బట్టి చూస్తే, హైదరాబాద్ ప్రజలు డిజిటల్ పేమెంట్స్‌కు బాగా అలవాటు పడినా, ఎప్పుడూ ఒకే యాప్ ఉపయోగించాలని కట్టుబడి ఉండటం లేదని తెలుస్తోంది. ఏ యాప్ ఎక్కువ క్యాష్‌బ్యాక్, రివార్డ్స్ అందిస్తే దానివైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే పేమెంట్ యాప్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ఆఫర్లు, మెరుగైన సేవలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. పేమెంట్ యాప్ కంపెనీలకు హైదరాబాద్ ఒక కీలకమైన మార్కెట్‌గా మారుతోంది. ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్న ఇక్కడి ప్రజలను ఇకపై సేవింగ్స్, రివార్డ్స్, ఇతర ఆర్థిక సేవల వైపు కూడా ఆకర్షించే అవకాశం ఉంది. కేవలం డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా, వినియోగదారులు అదే యాప్‌ను నిరంతరం ఉపయోగించేలా చేయడం కంపెనీల ముందున్న అసలు సవాలు. (ప్రతీకాత్మక చిత్రం)

