8 ఏళ్ల కిందట వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కుర్రాళ్లకు హాట్ ఫేవరైట్ అయిపోయింది. అసలు కొంచెం లోగా అనిపించినా సరే ఈ సినిమా పెట్టుకుని చూసేస్తుంటారు. అంతలా ఇంపాక్ట్ చూపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. అసలు ట్రైలర్ మాత్రం మాములుగా లేదు. ఈ సారి ఎంటర్టైనమెంట్ ఇంకా పీక్స్‌లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా నవంబర్ 19న రిలీజ్ కాబోతుంది.
Source link
ENE Repeat : 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ ట్రైలర్ రిలీజ్.. రచ్చ రంబోలానే..!
