ఈ మేళాలో భాగంగా మొత్తం 4,000 వరకు అపాయింట్మెంట్ స్లాట్లను విడుదల చేయనున్నారు. నార్మల్ పాస్పోర్ట్, తత్కాల్ పాస్పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేక మేళాకు సంబంధించిన అపాయింట్మెంట్ స్లాట్లను 2026 నవంబర్ 3న అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ ఆర్పీఓ పరిధిలో పనిచేస్తున్న అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్కేలు), పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో (పీఓపీఎస్కేలు) ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పాస్పోర్ట్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు, పాత పాస్పోర్ట్ రీఇష్యూ చేయించుకోవాలనుకునేవారు నార్మల్ కేటగిరీలో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. త్వరగా పాస్పోర్ట్ కావాలనుకునేవారు తత్కాల్ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరమైన వారు కూడా ఈ ప్రత్యేక మేళాలో అపాయింట్మెంట్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

